Share News

బిహార్, యూపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు

ABN , Publish Date - Sep 29 , 2026 | 04:09 PM

బిహార్, ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకూ మంగళవారం 10 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

బిహార్, యూపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు
Bharatiya Janata Party (BJP)

ఇంటర్‌నెట్ డెస్క్: బిహార్, ఉత్తర్​ప్రదేశ్‌లో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం 10 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. అలాగే మేజర్ నామినీల పేర్లను కూడా ప్రకటించింది.


బిహార్ నుంచి నామినీలుగా ఎంపికైన వారిలో నావల్ కిశోర్ యాదవ్, డాక్టర్ ఎన్‌కే యాదవ్ ఉన్నారు. ఇక యూపీ నుంచి నామినీలుగా ఎంపికైన వారిలో కేదార్ నాథ్ సింగ్, హరికిశోర్ తివారీతో పాటు మరో నలుగురు కూడా ఉన్నారు. అయితే, రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు 10 మంది అభ్యర్థులుగా ప్రకటించినప్పటికీ వారి పేర్లను ఇంకా వెల్లడించలేదు. బిహార్‌లో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్ఠానం.. యూపీలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.


ఇవీ చదవండి

లీగల్ ఓటర్లను తొలగించడం మరో ఓట్ చోరీ: రాహుల్ గాంధీ

మోదీ చేతిలో కీలుబొమ్మగా సీఈసీ.. మల్లికార్జున ఖర్గే ధ్వజం

Updated Date - Sep 29 , 2026 | 04:36 PM