Share News

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:32 PM

ప్రాణాలను పణంగా పెట్టి శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేసే కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి స్ఫూర్తిదాయకం
అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ కలిశెట్టి, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తదితరులు

శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రాణాలను పణంగా పెట్టి శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేసే కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు అన్నారు. జిల్లా పోలీసు ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళ వారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉందచి నివాళి అర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీస్‌ సిబ్బంది.. పరేడ్‌ కమాండర్‌ శంకర్‌ ప్రసాద్‌ నేతృత్వంలో నిర్వహించిన స్మృతి పరేడ్‌ ద్వారా అమరవీరులకు నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పో యిన వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను మంత్రి తెలు సుకున్నారు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడడంలో పోలీసులు చూపుతున్న చొరవ, గంజాయి, మా దక ద్రవ్యాల రవాణాను అరికట్టడంలో గొప్పగా పని చేస్తున్న పోలీసులను ఆయన అభినందించారు. మహిళ లపై అఘాయిత్యాలు, అపహరణలు, రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం సీసీ కెమెరాలు పెట్టి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని... పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ తరచూ చేపట్టాలని సూచించారు. ఇటీవల పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన ఆరువేల మందికి త్వరలోనే నియామక పత్రాలను అందజేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. పోలీసులు లేకుండా ప్రగతి లేదని, దేశ చరిత్ర లో పోలీసు సంస్మరణ దినం విశిష్టమైనదన్నారు. త్వర లోనే కారుణ్య నియామకాలపై దృష్టి సారిస్తామన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ప్రాణత్యాగం చేసిన ఎస్‌.బంగారు నాయుడు, ఎ.పాపారావు, ఎం.నరేంద్ర దాస్‌, ఎం.వెంకటరమణ, పి.కృష్ణమూర్తి తదితరుల సేవలను గుర్తు చేసుకున్నారు. పోలీసుల కుటుంబాలకు ఈ ఏడాది కారుణ్య నియామకాలు కల్పించామని, ఆరోగ్యభద్రత, కో-ఆప రేటివ్‌ సొసైటీల ద్వారా తక్కువ వడ్డితో రుణాలు అందిస్తు న్నామని చెప్పారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి కుటుంబ సభ్యులకు మంత్రి జ్ఞాపికలను అందించారు. ఓపెన్‌హౌస్‌ను అతిఽథులు తిలకించారు. పావురాలను, బెలూ న్లను గాల్లోకి విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తి, నడుకుదిటి ఈశ్వరరావు, డీఆర్వో వెంక టేశ్వరరావు, ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణ రావు, శేషాద్రి, ఆర్డీవో సాయి ప్రత్యూష, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

రిమ్స్‌ను మోడల్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం

అరసవల్లి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)ని మోడల్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రిమ్స్‌ వైద్య కళాశాలలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడు తూ.. జీజీహెచ్‌లో సిబ్బంది కొరత ఉందని, అలాగే శానిటేషన్‌, డ్రైనేజీ వ్యవస్థలో కూడా సమస్యలను గుర్తించామన్నారు. తక్షణం వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటికే రూ.80లక్షల పరికరాలను అందజేశామని, గతంలో మేం రూ.60 కోట్లతో చేపట్టిన నూతన హాస్టల్‌ భవనాలు, వైద్యకళాశాల లైబ్రరీ భవనాలు పూర్తయిపోయినా సరే, కేవలం రూ.2 కోట్ల వెలువైన ఫర్నిచర్‌ సమ కూర్చలేక వైసీపీ ప్రభుత్వం వదిలేసిందన్నారు.

వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నామని 2026 జూన్‌ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు, మూలపేట పోర్టు, పూర్తవుతాయన్నారు. జిల్లాలో పవర్‌ ప్రాజెక్టులు, మూలపేట ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయితే జిల్లాలో వలస లు పూర్తిగా నివారణ అవుతాయన్నారు. ప్రజలు సహకారంతోనే పూర్తిస్థాయి అభి వృద్ధి సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధి కారులు, ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.

వేతనాలు చెల్లించాలని సెక్యూరిటీ సిబ్బంది వినతి

మంగళవారం రిమ్స్‌ ఆసుపత్రి సమీక్ష సమావేశం సందర్భంగా రిమ్స్‌ సెక్యూరిటీ సిబ్బంది తమకు అగ్రిమెంట్‌ ప్రకారం కాంట్రాక్టర్‌ వేతనాలు ఇవ్వడం లేదని, తక్షణం తగు చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడిని కోరారు. దీంతో మంత్రి సంబంధిత సెక్యూరిటీ సంస్థ ప్రతినిధిని పిలిచి.. ఎందుకు వారికి వేతనాలు నిబంధనలకు అనుగుణంగా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అగ్రిమెంట్‌ ప్రకారం వారికి వేతనాలు ఇవ్వాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే నర్సింగ్‌ సిబ్బంది తమకు సిక్‌రూమ్‌ లేదని, కేటాయించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.

Updated Date - Oct 21 , 2025 | 11:32 PM