Share News

లీగల్ ఓటర్లను తొలగించడం మరో ఓట్ చోరీ: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:06 AM

ఢిల్లీలోని బేలా ఎస్టేట్‌లో ఓటరు జాబితా నుంచి 727 మంది ఓటర్ల పేర్లను తొలగించడంపై ఎన్నికల కమిషన్‌ను కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ఓటర్ల జాబితా నుంచి 727 మంది లీగల్ ఓటర్లను తొలగించడం మరో ఓట్ చోరీ అని ఆయన విమర్శించారు.

లీగల్ ఓటర్లను తొలగించడం మరో ఓట్ చోరీ: రాహుల్ గాంధీ

ఇంటర్‌నెట్ డెస్క్: ఢిల్లీలోని బేలా ఎస్టేట్‌లో ఓటరు జాబితా నుంచి 727 మంది ఓటర్ల పేర్లను తొలగించడంపై ఎన్నికల కమిషన్‌ను కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ఓటర్ల జాబితా నుంచి 727 మంది లీగల్ ఓటర్లను తొలగించడం మరో ఓట్ చోరీ అని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ఒక వీడియో పోస్టు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషర్ జ్ఞానేశ్ కుమార్ వెళ్లిపోతారని, కానీ.. ఆయన చేత ఓట్లను తొలగింపచేసిన వ్యవస్థ జవాబు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.


‘యమునా నది ఒడ్డున బెల్లా ఎస్టేట్‌లో 728 నివసిస్తారు. సర్ ప్రకియ తర్వాత ఓటరు జాబితాలో ఒక్కరి పేరు మాత్రమే ఉంది. అంటే, 727 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఆ ఓటర్లంతా కొన్ని దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు నిరుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారు ఓటు వేశారు. 2023లో వారి ఇండ్లను కూల్చివేశారు. అయినా కూడా వారు ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే ఉంటున్నారు. వారి ఇండ్లను కూల్చేశారన్న నెపంతో ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించామని అధికారులు చెబుతున్నారు. ఇంటికి, ఓటుహక్కుకు సంబంధం ఏంటి? ఇది సర్ కాదు. ఇది ఓట్ల చోరీ’ అని రాహుల్ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.


ఉన్న ఒక్క అవకాశాన్నీ దొంగిలిస్తున్నారు: రాహుల్

ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు చాలా కీలకమని, సామాన్యుల చేతిలో ఉండేది ఆ ఒక్క ఆయుధమేనని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు ఆ ఆయుధాన్ని కూడా సర్ పేరుతో దొంగిలిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా.. ఓటర్ లిస్ట్ రివిజన్, కొత్త ఓటర్ల చేర్పుపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చినప్పటి నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను రాహుల్ లక్ష్యంగా చేసుకని విమర్శలు చేస్తున్నారు.


ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే..

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే బీఎల్ఓ ఇంటింటి సర్వే చేశారని, ఓటర్ల ఇళ్లను కూల్చివేయడంతో ప్రస్తుతం ఓటర్లు అక్కడ నివసించడం లేదని అధికారులు తెలిపారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

యూఎస్‌లో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడులు

అమెరికా మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో బిష్ణోయ్ గ్యాంగ్ లీడర్

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 29 , 2026 | 12:24 PM