Share News

యూఎస్‌లో రూ.17 లక్షల కోట్లతో ఎస్సార్ గ్రూప్ అతిపెద్ద స్టీల్ ప్లాంట్

ABN , Publish Date - Sep 29 , 2026 | 07:43 AM

భారతీయ మల్టీనేషనల్ కంపెనీ ఎస్సార్ గ్రూప్ అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు..

యూఎస్‌లో రూ.17 లక్షల కోట్లతో ఎస్సార్ గ్రూప్ అతిపెద్ద స్టీల్ ప్లాంట్

ఇంటర్‌నెట్ డెస్క్: భారతీయ మల్టీనేషనల్ కంపెనీ ఎస్సార్ గ్రూప్ అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. తన అనుబంధ సంస్థ మెసాబి మెటాలిక్స్ ద్వారా అయొవా స్టేట్‌లో 18 బిలియన్ డాలర్ల (రూ.17 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆ పెట్టుబడులతో అయొవాలో మెసాబి మెటాలిక్స్ అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను నిర్మిస్తుందని ఆయన చెప్పారు. వైట్ హౌస్‌లోని ఓవర్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ ప్రకటన చేశారు.


ప్లాంట్ ఏర్పాటుపై ప్రకటన చేయడం తనకెంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం ఆ ప్లాంట్‌లో 10 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ‘అమెరికా చరిత్రలోనే అయొవా రాష్ట్రంలో మెసాబి మెటాలిక్స్ అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్లలో మెటాలిక్స్ ప్లాంట్ కూడా ఒకటి కాబోతుంది. అయితే, అమెరికాలో ఇప్పటివరకే అదే అతిపెద్ద ప్లాంట్’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.


విదేశాల్లోనూ ఎస్సార్..

శశి, రవి రుయియా అనే ఇద్దరు సోదరులు స్థాపించిన భారతీయ కంపెనీల సమూహమే ఎస్సా్ర్ గ్రూప్. ఐదు దశాబ్దాలుగా ఈ గ్రూప్ వ్యాపారం చేస్తోంది. ఈ గ్రూప్‌కు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగానూ అనేక పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. భారత్‌లో గుజరాత్‌లోని హజీరాలో దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం (10 మిలియన్ టన్నుల సామర్థ్యం) దీనికి ఉంది. అలాగే, గుజరాత్‌లోనే వాడినార్‌లో దేశంలోనే రెండో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం కూడా ఉంది.


ఇక విదేశాల్లోని యూకేలో షెల్ సంస్థకు చెందిన స్టాన్‌లో రిఫైనరీని ఎస్సార్ గ్రూప్ కొనుగోలు చేసింది. సౌదీ అరేబియాలో తక్కువ కర్బన ఉద్గారాలు విడుదల చేసే కొత్త ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. తాజాగా అమెరికాలో పెట్టుబడులు పెడుతున్న మెసాబి మెటాలిక్స్ అనే కంపెనీ ఎస్సార్ సంస్థకు చెందిన అమెరికా విభాగం. ఎస్సార్ గ్రూప్ 2007 నుంచి అమెరికాలోని మిన్నెసోటాలో వ్యాపారం చేస్తోంది. 140 కోట్ల టన్నుల కంటే ఎక్కువ ఇనుప ఖనిజ నిల్వలు ఉన్న మిన్నెసోటా స్టీల్ కంపెనీని ఈ గ్రూప్ కొనుగోలు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఇజ్రాయెల్‌లో ఉద్యోగాల పేరిట మోసం

భారీ వర్షాలకు నేపాల్‌ అతలాకుతలం

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 29 , 2026 | 08:34 AM