భారీ వర్షాలకు నేపాల్ అతలాకుతలం
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:27 AM
నేపాల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటం, వరదలు పోటెత్తడంతో ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు
24 మంది మృతి, 14 మంది గల్లంతు.. వందల ఇళ్లు ధ్వంసం
ఖాట్మండు, సెప్టెంబరు 28: నేపాల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటం, వరదలు పోటెత్తడంతో ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గల్లంతయ్యారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అనేక ఇళ్లు నేలమట్టమవగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విపత్తుకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. నివాస గృహాలకు సమీపంలో ఉన్న ఓ కొండచరియ క్షణాల్లో కుప్పకూలిపోవడం, స్థానికులు భయంతో కేకలు వేయడం వంటి దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు
ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..?