ఇజ్రాయెల్‌లో ఉద్యోగాల పేరిట మోసం
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:53 AM
ఇజ్రాయెల్‌లో ఉద్యోగాల పేరిట ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన ఇద్దరి నుంచి పాసుపోర్టులు తీసుకోవడంతో పాటు రూ.3.50 లక్షలు కాజేసిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది
హోటల్‌లో బంధించి బెదిరింపు
బాధితుల ఫిర్యాదు, కేసు నమోదు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఇజ్రాయెల్‌లో ఉద్యోగాల పేరిట ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన ఇద్దరి నుంచి పాసుపోర్టులు తీసుకోవడంతో పాటు రూ.3.50 లక్షలు కాజేసిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది కరకు చెం దిన జంపన ప్రకాశ్‌బాబు కుమారుడు ప్రకాశ్‌రాజ్, ఆయన మేనకోడలు ఎస్తేరు గొల్లకు ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలిప్పిస్తామని నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్‌కు చెందిన కస్పా శ్యామ్ భోజన్న నమ్మబలికాడు. ఢిల్లీలోని ఓ హోటల్‌లో బంధించి రూ.3.50లక్ష లను ఖాతాలకు బదిలీ చేయించుకున్నా డు. జూలై 2 నుంచి ఆగస్టు 24 వర కు యువతిని అదే హోటల్‌లో నిర్బంధించి, బెదిరించారు. చివరికి బాధితులు డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి చైతన్య దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి
రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు
ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది.