‘రెండు నెలలు ఆలస్యం’ ప్రచారం అవాస్తవం.. ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ క్లారిటీ..
ABN , Publish Date - Sep 29 , 2026 | 01:13 PM
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మరో రెండు నెలలు ఆలస్యం కావొచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది. ఈ ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది.
అమరావతి, సెప్టెంబర్ 29: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మరో రెండు నెలలు ఆలస్యం కావొచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది. ఈ ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్ మీడియాలో తప్పుడు, ధ్రువీకరణ లేని సమాచారంపై ఎస్‌ఈసీ క్లారిటీ ఇచ్చింది. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు మరో రెండు నెలలు పడుతుందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది.
ఎన్నికల రోల్స్, రిజర్వేషన్లకు సంబంధించిన కోర్టు కేసుల్లో క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని జరుగుతున్న ప్రచారం కూడా అవాస్తవమే అని ఎస్ఈసీ తెలిపింది. ఎన్నికల షెడ్యూల్‌పై వైరల్ అవుతున్న సమాచారం.. కమిషన్ జారీ చేసినది కాదని స్పష్టీకరించింది. ధ్రువీకరణ లేని సమాచారాన్ని నమ్మడం, ప్రచారం చేయడం, ఇతరులకు పంపించవద్దని ప్రజలు, రాజకీయ పార్టీలు, ఇతర భాగస్వాములకు ఎస్‌ఈసీ సూచించింది.
ఎన్నికల కమిషన్ పేరుతో కల్పిత, తప్పుదారి పట్టించే లేదా అనధికారిక సమాచారాన్ని ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఎస్‌ఈసీ హెచ్చరిక జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై ఏదైనా అధికారిక ప్రకటన ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా ప్రెస్ రిలీజ్ ద్వారా ఎస్‌ఈసీ వెల్లడిస్తుందని స్పష్టం చేసింది. వాట్సాప్, సోషల్ మీడియా, ఇతర అనధికారిక వేదికల్లో వచ్చే సమాచారాన్ని నమ్మే ముందు ఎస్‌ఈసీ అధికారిక వెబ్‌సైట్, అధికారిక ప్రకటనల ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించింది. ఈ ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై తప్పుడు ప్రచారానికి ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెరదించినట్లైంది.
ఇవి కూడా చదవండి...
ఏపీ SIRలో 99.96 శాతం నోటీసుల విచారణ పూర్తి.. ఇంకా 1,665 పెండింగ్
సచివాలయ ఉద్యోగులకు 15వేలకు పైగా ప్రమోషన్లు ఇచ్చాం: మంత్రి డోలా
Read Latest AP News And Telugu News