పెజెష్కియాన్ ప్రసంగం.. ‘బాహుబలి’తో పోలుస్తూ ఇరాన్ కాన్సులేట్ ఆసక్తికర పోస్ట్
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:40 AM
తెలుగు సినిమా సత్తా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో కనిపించింది. ఏకంగా ఓ దేశ దౌత్య కార్యాలయం తన సందేశం కోసం ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సన్నివేశాన్ని ఉపయోగించింది.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు సినిమా సత్తా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో కనిపించింది. ఏకంగా ఓ దేశ దౌత్య కార్యాలయం తన సందేశం కోసం ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సన్నివేశాన్ని ఉపయోగించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో చేసిన ‘తలవంచం.. మోకరిల్లం’ వ్యాఖ్యలకు అనుసంధానిస్తూ హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ‘బాహుబలి’ యుద్ధ సన్నివేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే..
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సెప్టెంబర్ 23న న్యూయార్క్‌లో జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు. ఇరాన్‌పై ఒత్తిళ్లు, ఆంక్షలు, బెదిరింపులను ప్రస్తావిస్తూ.. తమ దేశం తలవంచబోదని ఆయన స్పష్టం చేశారు. ‘‘మేము తలవంచం.. మోకరిల్లం’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి: ది బిగినింగ్’లోని యుద్ధ సన్నివేశాన్ని ఎక్స్‌లో పోస్టు చేసింది. భారీ సైన్యాన్ని ఎదుర్కొంటూ అమరేంద్ర బాహుబలి వెనక్కి తగ్గకుండా పోరాడే సన్నివేశాన్ని పెజెష్కియాన్ వ్యాఖ్యలతో జత చేసింది. దీంతో రాజకీయ సందేశానికి తెలుగు సినిమా మాస్ టచ్ జోడించినట్లైంది.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: భారత మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్‌కు సిల్వర్
హైవోల్టేజ్ డ్రామా.. ఇలాంటి రనౌట్ ఎప్పుడూ చూడలేదు!