Share News

ఆసియా క్రీడలు: క్రికెట్ సెమీస్ బెర్తులు ఖరారు.. భారత్ ప్రత్యర్థి ఎవరంటే?

ABN , Publish Date - Sep 29 , 2026 | 09:45 AM

ఆసియా క్రీడల్లో క్రికెట్‌ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకిగా మారుతున్నాడు. పురుషుల విభాగంలో నాలుగు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లూ వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో నేరుగా సెమీఫైనల్‌ బెర్తులు ఖరారయ్యాయి.

ఆసియా క్రీడలు: క్రికెట్ సెమీస్ బెర్తులు ఖరారు.. భారత్ ప్రత్యర్థి ఎవరంటే?
India vs Sri Lanka

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో క్రికెట్‌ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకిగా మారుతున్నాడు. పురుషుల విభాగంలో నాలుగు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లూ వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో నేరుగా సెమీఫైనల్‌ బెర్తులు ఖరారయ్యాయి. భారత్‌ సెమీస్‌లో శ్రీలంకతో తలపడనుంది. మరో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్‌ పోటీ పడనుంది. గురువారం ఈ రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.


మంగళవారం నగోయాలోని కొరోగి స్పోర్ట్స్‌ పార్క్‌లో శ్రీలంక-నేపాల్‌ మధ్య జరగాల్సిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. టాస్‌ కూడా సాధ్యం కాకుండా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో మెరుగైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్‌ ఆధారంగా శ్రీలంక సెమీఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం శ్రీలంక 9వ ర్యాంక్‌లో ఉండగా.. నేపాల్‌ 14వ స్థానంలో ఉంది.


భారత్‌ కూడా ఇదే తరహాలో సెమీఫైనల్‌ చేరింది. సోమవారం అఫ్గానిస్థాన్‌తో జరగాల్సిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో మెరుగైన ర్యాంకింగ్‌ ఆధారంగా టీమిండియా సెమీస్‌కు అర్హత సాధించింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానంలో ఉండగా.. అఫ్గానిస్థాన్‌ 10వ స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్‌ కూడా వర్షం కారణంగానే సెమీస్‌ బెర్తు దక్కించుకుంది. మలేసియాతో జరగాల్సిన క్వార్టర్‌ ఫైనల్‌ రద్దవడంతో బంగ్లాదేశ్‌ ముందంజ వేసింది. అంతకుముందే హాంకాంగ్‌తో పాకిస్థాన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ కూడా వర్షం కారణంగా రద్దవడంతో మెరుగైన ర్యాంకింగ్‌లో ఉన్న పాకిస్థాన్‌ సెమీస్‌కు చేరింది. అయితే ఆసియా క్రీడల్లో టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే సెమీఫైనల్‌కు చేరడం విశేషం.


ఇవి కూడా చదవండి:

మీరేనా సెలెక్షన్ కమిటీ ఛైర్మన్?.. పార్థివ్‌ను ఆటపట్టించిన ఆకాశ్ చోప్రా

నంబర్ల కోసం అయితే ఎక్కువకాలం ఆడలేం.. గిల్‌పై కోహ్లీ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 29 , 2026 | 09:45 AM