ఏపీ SIRలో 99.96 శాతం నోటీసుల విచారణ పూర్తి.. ఇంకా 1,665 పెండింగ్
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:50 AM
ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియపై తాజా వివరాలను సీఈవో కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 44.28 లక్షల నోటీసుల్లో 44.27 లక్షల నోటీసులపై విచారణ పూర్తి అయ్యినట్లు తెలిపింది.
అమరావతి, సెప్టెంబర్ 29: ఓటర్ల ప్రత్యేక సవరణ(SIR) ప్రక్రియపై తాజా వివరాలను సీఈవో కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 44.28 లక్షల నోటీసుల్లో 44.27 లక్షల నోటీసులపై విచారణ పూర్తి అయ్యినట్లు తెలిపింది. 99.96 శాతం నోటీసుల విచారణ పూర్తవగా.. ఇంకా 1665 నోటీసుల విచారణ పూర్తికావాల్సి ఉందని పేర్కొంది. విచారణ పూర్తి చేయాల్సిన వాటిలో తిరుపతిలో 1,554 పెండింగ్, ప్రకాశంలో 48, అనంతపురంలో 43, ఎన్టీఆర్ జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 8, గుంటూరులో 1 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. గుంటూరు, ఏలూరు, నంద్యాల, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో నోటీసుల విచారణ స్వల్పంగా పెండింగ్‌లో ఉందని చెప్పుకొచ్చింది.
అలాగే, 3.71 కోట్ల మంది ఎలక్టర్లలో 3.70 కోట్ల ఫొటోలను BLOలు ఆమోదం తెలిపారని సీఈవో కార్యాలయం పేర్కొంది. ఫొటో క్వాలిటీ చెక్‌లో 40 వేల మందివి పెండింగ్‌లో ఉన్నాయని.. అంటే 0.11 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. ఫొటో క్వాలిటీ చెక్‌లో అనంతపురం, నెల్లూరు, తిరుపతి, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో మరింత పురోగతి నమోదు అయినట్లు చెప్పింది. అంతేకాకుండా, ఫారం-6 దరఖాస్తుల్లో 69,184 పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. ఫారం-6 పెండింగ్‌లో తిరుపతి 12,566, నెల్లూరు 8,799, వైఎస్సార్ 7,824, ప్రకాశం 6,329, సత్యసాయి 4,844 ఫారం-6 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. అలాగే, ఫారం-6A దరఖాస్తులు 813, ఫారం-7 దరఖాస్తులు 8,478, ఫారం-8 దరఖాస్తులు 31,693 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.
నిన్న(సోమవారం) ఒక్కరోజే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్‌లో 17,413 పురోగతి నమోదైనట్లు సీఈవో కార్యాలయం చెప్పుకొచ్చింది. బీఎల్‌వోతో కాల్‌బుక్ చేసుకునే సేవలో మొత్తం 258 పెండెన్సీ ఉందని.. 48 గంటలు దాటిన BLO కాల్ అభ్యర్థనలు 80 ఉన్నాయని తెలిపింది. బీఎల్‌వోల వద్ద ఫొటో క్వాలిటీ చెక్ కోసం 40,927 పెండింగ్‌లో ఉండగా.. ఈఆర్‌వోల వద్ద 4.52 లక్షలు ఫొటో క్వాలిటీ చెక్ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు సీఈవో కార్యాలయం పేర్కొంది.
ఇవి కూడా చదవండి...
ఎర్రవల్లిలో అధికారుల సర్వే పూర్తి.. కలెక్టర్‌కు నివేదిక
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి.. అధిష్ఠానానికి ఆరుగురి పేర్లు
Read Latest AP News And Telugu News