Share News

తిరుపతి-కాట్పాడి రైల్వే డబ్లింగ్‌ భూసేకరణకు గెజిట్‌

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:43 AM

తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనుల్లో కీలక ముందడుగు పడింది.

తిరుపతి-కాట్పాడి రైల్వే డబ్లింగ్‌ భూసేకరణకు గెజిట్‌
Tirupati Katpadi railway doubling

న్యూఢిల్లీ: తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనుల్లో కీలక ముందడుగు పడింది. తిరుపతి-కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర రెండో రైల్వే లైన్‌ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలో ఏపీలోని తిరుపతి, చిత్తూరు జిల్లాలు, తమిళనాడులోని వేలూరు జిల్లా ఉన్నాయి.


rail.jpgచిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని వావిల్‌తోట, పూతలపట్టు తదితర గ్రామాలతో పాటు చిత్తూరు అర్బన్‌ పరిధిలోని ఎల్‌బీ పురం, గండ్లపల్లి, తిమ్మసముద్రం, మురకంబట్టు తదితర ప్రాంతాల్లోని భూములను రైల్వేశాఖ సేకరించనుంది. భూయజమానులు ఈ భూసేకరణపై అభ్యంతరాలను 30 రోజుల్లోగా చిత్తూరు ఆర్‌డీవోకు రాతపూర్వకంగా ఇవ్వాలని రైల్వేశాఖ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

అంచనాలకు అందని స్థాయిలో బంగారం పతనం

ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా ‘మిషన్‌ కర్మయోగి’

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 29 , 2026 | 11:43 AM