Share News

నేడు ఒంగోలుకు జగన్‌ రాక

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:56 AM

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ఒంగోలుకు వస్తు న్నారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఏబీఎం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో ఆయన దిగుతారు.

నేడు ఒంగోలుకు జగన్‌ రాక
జగన్‌ పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న వైసీపీ నాయకులు

కాకుమాను రాజశేఖర్‌ కుటుంబానికి పరామర్శ

ఏర్పాట్లను పరిశీలించిన వైసీపీ నేతలు

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ఒంగోలుకు వస్తు న్నారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఏబీఎం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో ఆయన దిగుతారు. అక్కడి నుంచి కారులో బయల్దేరి ఇటీవల మృతి చెందిన క్లౌపేటలోని కాకుమాను రాజశేఖర్‌ ఇంటికి చేరుకుంటారు. అక్కడ రాజశేఖర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్‌లో బయల్దేరి తాడేపల్లికి వెళ్తారు. జగన్‌ పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట మాజీమంత్రి సురేష్‌, ఒంగోలు ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్‌, వై.వెంకటేశ్వరరావు, వేమా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 02:12 AM