ఎర్రవల్లిలో అధికారుల సర్వే పూర్తి.. కలెక్టర్‌కు నివేదిక
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:06 AM
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి, కొండపాక మండలం వెలికట్ట గ్రామాల్లో భూములకు సంబంధించి అధికారుల సర్వే పూర్తైంది.
సిద్దిపేట, సెప్టెంబర్ 29: గజ్వేల్ నియోజకవర్గంలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి, కొండపాక మండలం వెలికట్ట గ్రామాల్లో భూములకు సంబంధించి అధికారుల సర్వే పూర్తైంది. ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో ఉన్న 388 ఎకరాలు, వెలికట్టలోని సర్వే నంబర్ 271లో అధికారులు సర్వే నిర్వహించారు. ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో 244 మంది అనుభవదారులకు, వెలికట్టలోని సర్వే నంబర్ 271లో ఉన్న 118 మంది అనుభవదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆయా భూముల్లో పొజిషన్ సర్వే నిర్వహించారు.
ఎర్రవల్లి గ్రామంలో అధికారులు ఎనిమిది రోజుల పాటు సర్వే చేపట్టారు. అలాగే వెలికట్ట గ్రామంలో ఐదు రోజుల పాటు సర్వే కొనసాగింది. భూముల వివరాలు తదితర అంశాలను పరిశీలించిన అధికారులు సర్వేను పూర్తి చేశారు. ఈ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు అధికారులు అందజేశారు. ఆ నివేదికను ప్రభుత్వానికి కలెక్టర్ అందజేయనున్నారు.
కాగా.. ఇటీవల అసెంబ్లీ వేదికగా సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల పరిధిలోని భూముల లెక్కలను తేల్చాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు.. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో సర్వే చేపట్టారు. ఎర్రవల్లిలోని 325 సర్వే నంబర్‌లోని 388 ఎకరాల భూముల్లో సర్వే నిర్వహించారు. అలాగే వెలికట్ట గ్రామంలోనూ సర్వే చేశారు. భారీ బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియను చేపట్టి... భూముల సర్వేను పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ఏపీ సర్కార్ సీరియస్
నిమ్స్ డాక్టర్ కేసులో ఏసీబీ సోదాలు.. రూ.7 లక్షలు స్వాధీనం
Read Latest Telangana News And Telugu News