సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ఏపీ సర్కార్ సీరియస్
ABN , Publish Date - Sep 29 , 2026 | 09:55 AM
సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆందోళనల్లో పాల్గొన్న 45 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అమరావతి, సెప్టెంబర్ 29: సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆందోళనల్లో పాల్గొన్న 45 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిరసనలో కీలకంగా వ్యవహరించిన 45 మందిని పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా విజయవాడలో ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆందోళనల్లో పాల్గొన్న వారి వివరాలకు సంబంధించిన అంశాలతో ఇప్పటికే ప్రభుత్వానికి పోలీసులు నివేదిక అందజేశారు.
హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని అధికారులు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించిన అంశంపైనా ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఆందోళనలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, సచివాలయ ఉద్యోగుల ఆందోళనల్లో బయటి వ్యక్తుల ప్రమేయంపైనా ఇప్పటికే ప్రభుత్వానికి నిఘావర్గాలు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే 45 మందిపై కేసులు నమోదు చేసి, అరెస్టులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలకు వర్ష సూచన
Read Latest AP News And Telugu News