Share News

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

ABN , Publish Date - Sep 29 , 2026 | 08:06 AM

ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలకు వర్ష సూచన
Andhra Pradesh Rain Alert

అమరావతి, సెప్టెంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అనకాపల్లి, డాక్టర్‌ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండటంతో పాటు వాతావరణ పరిస్థితులను బట్టి వర్షం తీవ్రతలో మార్పులు ఉండవచ్చని అధికారులు సూచించారు. మరోవైపు మిగిలిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ అక్కడక్కడా చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో వర్ష సూచన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


వర్షాల సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని పేర్కొన్నారు. జిల్లాల వారీగా వాతావరణ పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


ఈ వార్తలూ చదవండి

గోల్ఫ్ బంతులు మింగేసిన పాము.. కాపాడిన వైద్యులు.. వీడియో వైరల్

కొండచిలువలను వేటాడే రోబో కుందేళ్లు.. ఫ్లోరిడాలో కొత్త టెక్నాలజీ

Updated Date - Sep 29 , 2026 | 09:04 AM