విజయవాడ ఆటోనగర్‌లో దారుణ హత్య.. ఫోన్ విషయంలో గొడవతో..
ABN , Publish Date - Sep 29 , 2026 | 07:55 AM
విజయవాడ ఆటోనగర్‌లో ఫోన్ విషయంలో జరిగిన చిన్న వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి లారీ క్లీనర్‌పై రాయితో దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..
విజయవాడ, సెప్టెంబర్ 29: నగరంలోని ఆటోనగర్‌లో ఫోన్ పోయిందన్న విషయంపై తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రాయితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫోన్ కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నిందితుడు లారీ క్లీనర్‌పై రాయితో బలంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పటమట పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, హత్యకు సంబంధించిన పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనలో హత్యకు పాల్పడిన వ్యక్తిని పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని విచారిస్తూ హత్యకు అసలు కారణం ఏమిటి, ఫోన్ విషయంలో వివాదం ఎలా మొదలైంది, దాడికి దారితీసిన పరిస్థితులు ఏంటనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాయితో బలంగా కొట్టడంతోనే లారీ క్లీనర్ మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పటమట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, నిందితుడి విచారణ ఆధారంగా హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలూ చదవండి
గోల్ఫ్ బంతులు మింగేసిన పాము.. కాపాడిన వైద్యులు.. వీడియో వైరల్
కొండచిలువలను వేటాడే రోబో కుందేళ్లు.. ఫ్లోరిడాలో కొత్త టెక్నాలజీ