Share News

యాదాద్రిలో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని వందకు పైగా గొర్రెల మృతి

ABN , Publish Date - Sep 29 , 2026 | 08:58 AM

గొర్రెల కాపరి రైల్వే పట్టాల సమీపంలో నిద్రిస్తున్న సమయంలో దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శబ్దానికి గొర్రెలు భయపడి పరుగులు తీశాయని, ఈ క్రమంలో అవి రైల్వే పట్టాలపైకి వెళ్లడంతో రైలు ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

యాదాద్రిలో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని వందకు పైగా గొర్రెల మృతి
Yadadri Train Accident

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 29: జిల్లాలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్–ఘట్కేసర్ మధ్య దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 100కు పైగా గొర్రెలు మృతి చెందగా, బాధితుడికి భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. గొర్రెల కాపరి రైల్వే పట్టాల సమీపంలో నిద్రిస్తున్న సమయంలో దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శబ్దానికి గొర్రెలు భయపడి పరుగులు తీశాయని.. ఈ క్రమంలో అవి రైల్వే పట్టాలపైకి వెళ్లడంతో రైలు ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


గొర్రెల యజమానులు యాదాద్రి-భువనగిరి జూలూరు అలీనగర్‌కు చెందినవారిగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఈస్ట్ సిటీ సమీపంలో గొర్రెలను మేపుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతి చెందిన గొర్రెల విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని బాధితుడు వాపోతున్నాడు. ప్రమాదంలో కొన్ని గొర్రెలు గాయపడగా..వాటిని సైతం స్థానికులు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. రైల్వే అధికారులు.. పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి

గోల్ఫ్ బంతులు మింగేసిన పాము.. కాపాడిన వైద్యులు.. వీడియో వైరల్

కొండచిలువలను వేటాడే రోబో కుందేళ్లు.. ఫ్లోరిడాలో కొత్త టెక్నాలజీ

Updated Date - Sep 29 , 2026 | 10:31 AM