Share News

నిమ్స్ డాక్టర్ కేసులో ఏసీబీ సోదాలు.. రూ.7 లక్షలు స్వాధీనం

ABN , Publish Date - Sep 29 , 2026 | 10:44 AM

తెలంగాణలో సంచలనం సృష్టించిన నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

నిమ్స్ డాక్టర్ కేసులో ఏసీబీ సోదాలు.. రూ.7 లక్షలు స్వాధీనం
ACB Raids

హైదరాబాద్, సెప్టెంబర్ 29: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈరోజు(మంగళవారం) తెల్లవారుజాము నుంచి NIMS ఉద్యోగులకు చెందిన ఐదుగురి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా NIMS బార్బర్ ధన్‌రాజ్ ఇంట్లో రూ.7 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, ఐదు ప్రాంతాల్లో లభించిన భూముల డాక్యుమెంట్లు, నగదు లావాదేవీలపైనా ఆరా తీశారు. ఆస్తుల వివరాలు, మనీట్రయిల్‌పై అధికారులు విచారణ చేపట్టారు. బినామీ ఆస్తుల వ్యవహారంపై దృష్టిసారించారు. మరోవైపు డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు.. కోర్టును కోరనున్నారు.


ఇటీవల నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌ ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు.. దాదాపు రూ.80 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గతంలోనూ నిమ్స్ వైద్యుడిగా పనిచేస్తున్న సమయంలో ఓ రోగి వద్ద డబ్బులు తీసుకుంటూ నిమ్స్ డైరెక్టర్‌కు పట్టుబడి ఉద్యోగాన్ని కోల్పోయారు. ఆ తర్వాత పెద్దల అండతో లక్ష్మీ భాస్కర్ తిరిగి 2007లో నిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరారు. తరచూ విదేశీ ప్రయాణాలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. అవకాశమున్న ప్రతిచోట లక్ష్మీ భాస్కర్ డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ఏపీ సర్కార్ సీరియస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 29 , 2026 | 10:54 AM