Share News

10 నెలలుగా పెద్దపులి సంచారం.. భయాందోళనలో పోలవరం ఏజెన్సీ వాసులు

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:43 PM

పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం ఇందుకూరు రేంజ్‌లో పెద్దపులి సచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 10 నెలలుగా పెద్దపులి సంచారం కొనసాగుతోంది.

10 నెలలుగా పెద్దపులి సంచారం.. భయాందోళనలో పోలవరం ఏజెన్సీ వాసులు
Tiger Movement

పోలవరం జిల్లా, సెప్టెంబర్ 29: జిల్లాలోని దేవీపట్నం మండలం ఇందుకూరు రేంజ్‌లో పెద్దపులి సచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 10 నెలలుగా పెద్దపులి సంచారం కొనసాగుతోంది. నెలకోట-రామదుర్గం మార్గంలోని పోలవరం ప్రాజెక్టు టన్నెల్ వద్ద పులి కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో రామదుర్గం కొండపైకి భక్తులు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. పూడిపల్లి, గొందూరు, పోచమ్మ గండి, రామదుర్గం, నెలకోట, చిన్నారిగండి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


గతంలో ఇందుకూరు రేంజ్‌లో అడవి పంది పిల్లను పెద్దపులి చంపేసింది. ఫోక్స్‌పేట రేంజ్‌లో 6 పశువులపై దాడుల తర్వాత ఇందుకూరు రేంజ్‌లోకి ప్రవేశించింది. పులి సంచారంతో గిరిజన గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు రావొద్దని అధికారులు సూచించారు. పులిని త్వరగా బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

సచివాలయ ఉద్యోగులకు 15వేలకు పైగా ప్రమోషన్లు ఇచ్చాం: మంత్రి డోలా

‘రెండు నెలలు ఆలస్యం’ ప్రచారం అవాస్తవం.. ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ క్లారిటీ..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 29 , 2026 | 03:45 PM