Share News

ఆల్మట్టికి పోటెత్తుతున్న వరద

ABN , Publish Date - Jul 25 , 2026 | 01:43 PM

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి వరద పోటెత్తుతోంది.

ఆల్మట్టికి పోటెత్తుతున్న వరద
Almatti dam flood

బళ్లారి(బెంగళూరు): కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి (లాల్‌బహదూర్‌ శాస్త్రి) జలాశయానికి వరద పోటెత్తుతోంది. జలాశయ అధికారులు ఈ సీజన్‌లో తొలిసారిగా ప్రాజెక్టు 19 క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు 84,611 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.


pandu1.jpgజలాశయంలో 106.939 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ఇది మొత్తం సామర్థ్యంలో 86.88 శాతానికి చేరింది. ఎగువన భారీ వర్షాలు కొనసాగుతుండటంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులు దాటితే మిగిలిన క్రస్ట్‌ గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆల్మట్టి నుంచి నీరు విడుదల చేయడంతో ఏపీలోని ప్రాజెక్టులకు భారీగా నీరు చేరనుంది.


pandu1.3.jpgతుంగభద్రకు తగ్గుతున్న ఇన్‌ఫ్లో...

తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుతోంది. గురువారం 24,821 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, శుక్రవారం అది 5,571 క్యూసెక్కులు తగ్గి 19,250 క్యూసెక్కులకు పడిపోయింది. నీటి మట్టం 1605.47 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 29.471 టీఎంసీలకు చేరింది. తాగునీటి అవసరాలకు కాలువలకు 3,189 క్యూసెక్కులు వదులుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సంతానం కోసం ఆరాటం

హోం మంత్రి అనిత ‘ఎక్స్‌’ అకౌంట్ హ్యాక్.. అధికారుల అలర్ట్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 01:43 PM