నిట్‌కు ఎదురుగా అకడమిక్ బ్లాక్
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:48 PM
ప్రతి ష్ఠాత్మకమైన వరంగల్ నిట్ విద్యార్థుల అవసరా లకు అనుగుణంగా సౌకర్యాలను క్రమంగా విస్తరిస్తోంది.
ఆ పక్కనే రీసెర్చ్ ప్రాజెక్టు
రూ.3కోట్లతో నిర్మాణమవుతున్న ముఖ ద్వారం
హనుమకొండ: ప్రతి ష్ఠాత్మకమైన వరంగల్ నిట్ విద్యార్థుల అవసరా లకు అనుగుణంగా సౌకర్యాలను క్రమంగా విస్తరిస్తోంది. నిట్ ఔన్నత్యం ప్రతిబింబించేలా ప్రవేశ ముఖ ద్వారాన్ని నిర్మిస్తున్నది తెలిసిందే. దీనితో పాటు మరి కొన్ని నిర్మాణాలను కూడా త్వరలో చేపట్టబోతున్నది. వీటికి కేంద్రం నుంచి అనుమ తి కూడా లభించినట్టు తెలిసింది. ఇందులో ఒకటి అకడమిక్ బ్లాక్ కాగా, రెండోది రీసెర్చ్ ప్రాజెక్టు సెంటర్.
రూ.3కోట్లతో..
నిట్ ప్రవేశ ముఖ ద్వారాన్ని రూ.3కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ పనిని చేపట్టిం ది. ఆరు నెలల్లో దీనిని పూర్తి చేస్తారు. ఈ ముఖ ద్వారాన్ని హనుమకొండకు చెందిన వాయిడ్ అర్కిటెక్ట్స్ సంస్థ ప్రతినిధి రాజేశ్ డిజైన్ చేశారు. నిట్ ఉన్నతాధికారులు, సీపీడబ్ల్యు ఇంజనీర్లతో పలు సార్లు సమావేశమై దీనిని సుదీర్ఘంగా చర్చించిన తర్వాత డిజైన్‌కు తుదిరూపం ఇచ్చారు. వరంగల్ నిట్ దేశంలో అత్యున్నత సాంకేతిక కళాశాలల్లో ఒకటి. కళాశాల ఔన్నత్యం ప్రతిబిం బించేలా, భవిష్యత్తులో కళాశాల విస్తరణతో పెరిగే అవసరాలు, విలువలు, విద్యా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని ఒక అద్వితీయమైన శాశ్వత కట్టడంగా దీన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో భాగంగానే ప్రస్తుతం ప్రవేశ ద్వారంగా ఉన్న కాకతీయ కళాతోరణం మధ్యలో 8అడుగుల ఎత్తైన ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. కళాతోరణానికి ఇరువైపుల రెండు భారీ గేట్లతోపాటు ఇరువైపులా సెక్యూరిటీ రూమ్‌లు, టాయిలెట్లు నిర్మిస్తారు. కళాశాలలో ప్రస్తుతం పార్కింగ్ సౌకర్యం లేదు. ఈలోటు తీర్చడానికి కళాశాల లోపల కలాం గెస్ట్‌హౌస్‌కు ఎదురుగా ఎడమవైపు పార్కింగ్ కోసం ప్రత్యేకంగా విశాలమైన షెడ్డును నిర్మిస్తారు.
అకడమిక్ బ్లాక్
వరంగల్ నిట్‌కు ఎదురుగా సిబ్బంది క్వార్టర్స్ పక్కనే అకడమిక్ బ్లాక్‌ను నిర్మించనున్నారు. నిట్‌కు చెందిన ఒక విద్యాసంబంధమైన భవనాన్ని బయట నిర్మించనుండడం ఇదే మొదటి సారి. కళాశాల క్యాంపస్‌లో ఇప్పటికే పలు భవనాల నిర్మాణం జరిగింది. మరికొన్ని భవనాల నిర్మాణం జరుగుతోంది. దీనితో కొత్త భవనాలకు స్థలం కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీనితో బహుల అంతస్తుల భారీ భవనాన్ని నిట్‌కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించాలని నిర్ణయించారు. ఈ భవన నమూనా రూపకల్పన పూర్తయింది. కేంద్రం నుంచి ఆమోదం కూడా లభించింది. అయితే ఎన్ని అంతస్తులతో దీనిని నిర్మించేది స్పష్టత లేదు.
రీసెర్చ్ ప్రాజెక్టు సెంటర్
నిట్‌కు సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్టు సెంటర్ కోసం మరో భవనాన్ని కూడా నిట్‌కు ఎదురుగా నిర్మించనున్నారు. నిట్‌లో ప్రస్తుతం పెద్ద ఎత్తున పరిశోధనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పలు ప్రాజెక్టు పరిశోధనా ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయి. ఈ నేపథ్యంలో నిట్ ప్రాంగణంలో ఉన్న ప్రయోగశాలలు సరిపోవడం లేదు. అదనంగా కొత్త భవనాలను నిర్మించాల్సిన అవసరం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని నిట్‌కు ఎదురుగా అకడమిక్ బ్లాక్‌కు దగ్గర్లోనే ఈ రీసెర్చ్ ప్రాజెక్టు సెంటర్ భవనాన్ని నిర్మించనున్నారు.
వరంగల్ వారసత్వాన్ని ప్రతిబింబించేలా...
రాజేశ్, వరంగల్ నిట్ ప్యానెల్ ఆర్కిటెక్ట్, హనుమకొండ
ఎన్‌ఐటీ వరంగ ల్ వారసత్వాన్ని, భవిష్యత్ దృక్ప థాన్ని ప్రతిబింబిం చే ప్రవేశ ద్వారాన్ని రూపొందించాలనే మా సంకల్పమే ఈ రూపకల్పనకు ఆధారం. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం నుంచి స్ఫూర్తి పొంది, సమకాలీన నిర్మాణ శైలిలో దీనిని ఆవిష్కరిస్తూ, సంప్రదాయం, నవనీత, కార్యసాధకతల సమన్వయం తో ఈ డిజైన్‌ను సృష్టించాం. ప్రవేశ ద్వారం వరంగల్ నిట్ అత్యుత్తమ విద్యా విలువలు, గుర్తింపు, భవిష్యత్ ఆశయాలను ప్రతిబింబించే శాశ్వత నిర్మాణ చిహ్నంగా నిలుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కమర్షియల్ ఆదాయంపై దక్షిణ డిస్కం దృష్టి
Read Latest AP News And Telangana News And International News And Telugu News