Share News

ప్రధాని మోదీ పేరుతో నకిలీ వీడియోలు.. పాకిస్థాన్ సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం ఆరోపణ..

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:25 PM

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల పేర్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.

ప్రధాని మోదీ పేరుతో నకిలీ వీడియోలు.. పాకిస్థాన్ సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం ఆరోపణ..
PIB Fact Check

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల పేర్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇవి నిజమైన వీడియోలు కావని, కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన నకిలీ వీడియోలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది (PM Modi AI video).


ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ప్రధాని మోదీ నిరసనకారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు చూపిస్తూ కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, అలాంటి వ్యాఖ్యలు ప్రధాని ఎప్పుడూ చేయలేదని, వీడియోల్లోని దృశ్యాలు, స్వరం రెండూ ఏఐ సాయంతో మార్పులు చేసినవేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది (PIB Fact Check).


ఈ తప్పుడు ప్రచారం వెనుక పాకిస్థాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది (AI misinformation). ప్రజల్లో గందరగోళం సృష్టించడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం లక్ష్యంగా ఈ వీడియోలను ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. ప్రజలు సోషల్ మీడియాలో కనిపించే వీడియోలను నమ్మకుండా, అధికారిక వనరుల ద్వారా నిజానిజాలు నిర్ధారించుకోవాలని ప్రభుత్వం సూచించింది.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి..

Updated Date - Jul 25 , 2026 | 12:29 PM