Share News

‘భయపడినవాడు ముందుకు సాగలేడు’.. సల్మాన్ పోస్టు వైరల్..

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:39 AM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ వివాదంపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆయన.. తాజాగా చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు.

‘భయపడినవాడు ముందుకు సాగలేడు’.. సల్మాన్ పోస్టు వైరల్..
Bollywood Actor Salman Khan

ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ వివాదంపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆయన.. తాజాగా చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. జిమ్‌లో వర్కౌట్ చేసిన తర్వాత తీసిన రెండు ఫొటోలను సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో సిక్స్ ప్యాక్‌తో తన ఫిట్‌నెస్‌ను మరోసారి చూపించారు. 'సల్మాన్ ఖాన్ డర్ గయా.. హుమ్.. జో డర్ గయా వో మర్ గయా' అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టారు. అయితే, ఆ ఫొటోలకు జత చేసిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీసింది.


క్యాప్షన్‌పైనే చర్చ..

సల్మాన్ పెట్టిన ఈ వ్యాఖ్య వెనుక ఉద్దేశం ఏమిటన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆయనపై వచ్చిన ట్రోల్స్‌కు ఇచ్చిన సమాధానంగా దీన్ని కొందరు అభిమానులు భావిస్తుండగా.. మరికొందరు ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ పోస్ట్‌కు ప్రత్యేక అర్థం ఉందని అంటున్నారు.


నీట్ వివాదంపై ఏమన్నారంటే..

నీట్ పేపర్ లీక్ అంశంపై ఇటీవల సల్మాన్ ఖాన్ స్పందించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు చేశారు. విద్యార్థుల భద్రత, భవిష్యత్తే ముఖ్యమని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సల్మాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. భయపడాల్సిన అవసరం లేదని, విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయని చేసిన సల్మాన్ వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.


లుక్‌పై వచ్చిన ట్రోల్స్‌కు చెక్..?

ఇటీవల ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన సల్మాన్ ఖాన్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన శరీరాకృతి, ఆరోగ్యంపై కొందరు నెటిజన్లు కామెంట్లు చేయగా.. మరికొందరు మీమ్స్‌తో స్పందించారు. తాజాగా జిమ్ ఫొటోలతో తన ఫిట్‌నెస్‌ను చూపించిన సల్మాన్.. కామెంట్లు చేసిన వారికి ఫొటోలతోనే సమాధానం ఇచ్చారని అభిమానులు భావిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ చిత్రంలో నటిస్తున్నారు. 2020 గాల్వాన్ వ్యాలీ ఘర్షణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

సోనమ్ వాంగ్‌చుక్‌‌పై విమర్శలు.. ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్..

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డీప్‌ఫేక్ వీడియోపై కేసు నమోదు..

Updated Date - Jul 25 , 2026 | 12:41 PM