సీఎం విజయ్‌పై సీబీఐ కేసు నమోదుకు అవకాశం: ఎంపీ ఇన్బదురై
ABN , Publish Date - May 16 , 2026 | 11:28 AM
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచేందుకు బేరసారాల ద్వారా పరోక్షంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు పొందిన ముఖ్యమంత్రి విజయ్‌పై సీబీఐ కేసు నమోదు చేసే అవకాశముందని అన్నాడీఎంకే నేత, ఎంపీ ఇన్బదురై అభిప్రాయపడ్డారు.
అన్నాడీఎంకే ఎంపీ ఇన్బదురై
చెన్నై: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచేందుకు బేరసారాల ద్వారా పరోక్షంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు పొందిన ముఖ్యమంత్రి విజయ్‌పై సీబీఐ కేసు నమోదు చేసే అవకాశముందని అన్నాడీఎంకే నేత, ఎంపీ ఇన్బదురై అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే మ్యాజిక్ ఫిగర్ 118 కంటే తక్కువ స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని పెంచేందుకు కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, డీపీఐ, ఐయూఎంఎల్ పార్టీల మద్దతు కూడ గట్టుకుంది.
ఈ నేపథ్యంలో, బుధవారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో అన్నాడీఎంకే చీలిక వర్గానికి చెందిన సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేయ్యడంతో టీవీకే ప్రభుత్వ బలం మరింత పెరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా అసెంబ్లీలో అన్నాడీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఇన్బదురై తప్పుబట్టారు.
శనివారం తన ఎక్స్‌పేజీలో పోస్ట్ చేసిన వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘1993లో పార్లమెంట్‌లో విశ్వాస ఓటు గెలుచుకోడానికి గుర్రపు బేరసారాల ద్వారా పరోక్షంగా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు జేఎంఎం ఎంపీల మద్దతు పొందారు. ఈ వ్యవహారంలో నరసింహారావుతో పాటు భూటాసింగ్‌లపై సీబీఐ కేసులు నమోదు చేసినట్లే, ఇప్పటి టీవీకే ప్రభుత్వ ముఖ్యమంత్రి విజయ్‌పై కూడా కేసు దాఖలయ్యే అవకాశముంది.’’ అని ఆయన అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం
గోల్డ్, సిల్వర్ రేట్స్ పతనం.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News