Share News

గోల్డ్, సిల్వర్ రేట్స్ మళ్లీ డౌన్.. నేడు ఎంత తగ్గాయంటే..

ABN , Publish Date - May 16 , 2026 | 10:37 AM

భారత్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

గోల్డ్, సిల్వర్ రేట్స్ మళ్లీ డౌన్.. నేడు ఎంత తగ్గాయంటే..
Gold, Silver Rates Fall on may 16

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో నేడూ బంగారం, వెండి ధరల్లో పతనం కనిపిస్తోంది. అంతర్జాతీయ అనిశ్చితులకు తోడు యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు పెరగడం, డాలర్ బలపడుతున్న నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మే 16) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్నటితో పోలిస్తే రూ.980ల మేర తగ్గి రూ.1,56,930కు పడిపోయింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ.900ల మేర తగ్గి రూ.1,43,850కు చేరుకుంది. నగరంలో కిలో వెండి ధర రూ.15 వేల మేర తగ్గి రూ.2.9 లక్షలకు దిగింది (Gold, Silver Rates on May 16).


దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సగటున రూ.950 మేర తగ్గింది. వెండి ధరలో రూ.10 వేల మేర కోత పడింది. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,60,910కు చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,47,500 వద్ద ట్రేడవుతోంది. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,57,080గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,44,000గా ఉంది. ముంబైలో 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,930కు చేరుకోగా 22 క్యారెట్ల వెండి ధర 1,43,850కు చేరింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.3 లక్షల మార్కు దిగువకు చేరుకుంది. చెన్నైలో గరిష్ఠంగా కిలో వెండి రూ.2.9 లక్షల వద్ద ట్రేడవుతోంది.


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

భారత్‌లో పుంజుకున్న ఎగుమతులు.. 49 నెలల గరిష్ఠానికి చేరిక

రూపాయి పతనం.. డాలర్‌ @: రూ.96

Updated Date - May 16 , 2026 | 11:11 AM