Share News

బాధగా ఉంది.. కానీ తప్పనిసరి పరిస్థితి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

ABN , Publish Date - May 16 , 2026 | 10:32 AM

నెల్లూరులో జరగాల్సిన మహానాడు రద్దు కావడం బాధాకరమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. దేశ ప్రయోజనాలు, ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు.

బాధగా ఉంది.. కానీ తప్పనిసరి పరిస్థితి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
MLA Kotamreddy Comments on Mahanadu

నెల్లూరు: మహానాడు కార్యక్రమం రద్దు కావడం బాధాకరమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో మహానాడును భారీ స్థాయిలో నిర్వహించాలని అందరం భావించామని తెలిపారు. మహానాడు చరిత్రలో 'నెల్లూరుకు ముందు.. నెల్లూరుకు తర్వాత' అని చెప్పుకునేలా ఈసారి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అయితే దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపుకు స్పందిస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.


తప్పనిసరి పరిస్థితుల్లోనే మహానాడును రద్దు చేసినట్లు తెలిపారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మహానాడు నిర్వహించనున్నారని చెప్పారు. మహానాడు రద్దు కావడం పార్టీ శ్రేణులకు నిరాశ కలిగించినప్పటికీ, దేశ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఇదే సింహపురి గడ్డ అయిన నెల్లూరు జిల్లాలో మహానాడును ఘనంగా నిర్వహించాలని సామాన్య టీడీపీ కార్యకర్తగా చంద్రబాబును కోరుతున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

గోల్డ్, సిల్వర్ రేట్స్ పతనం.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News 

Updated Date - May 16 , 2026 | 10:32 AM