ఏపీపీఎస్సీ ఫలితాలు విడుదల
ABN , Publish Date - May 16 , 2026 | 06:31 AM
పలు నోటిఫికేషన్ల స్ర్కీనింగ్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పలు నోటిఫికేషన్ల స్ర్కీనింగ్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. భూగర్భ జలవనరుల సర్వీసుల్లోని టెక్నికల్ అసిస్టెంట్(జియో ఫిజిక్స్), దేవదాయశాఖలో గ్రేడ్-3 ఈవో పోస్టు, మున్సిపల్ శాఖ పరిధిలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల స్ర్కీనింగ్ ఫలితాలను ప్రకటించింది. ఎంపికైనవారికి 25న విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం తుది ఫలితాలు వెల్లడిస్తారు.