టీవీకే పాలన భేష్ !
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:45 PM
రాష్ట్రంలో విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వ పాలన భేషుగ్గా ఉందని అన్నాడీఎంకే లాల్గుడి నియోజకవర్గ ఎమ్మెల్యే లీమా రోస్ కొనియాడారు.
అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమారోస్
చెన్నై: రాష్ట్రంలో విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వ పాలన భేషుగ్గా ఉందని అన్నాడీఎంకే లాల్గుడి నియోజకవర్గ ఎమ్మెల్యే లీమా రోస్ కొనియాడారు. తిరుచ్చి సెంట్రల్ బస్‌స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం జస్టిస్ పార్టీ నేత దివంగత ఏటీ పన్నీర్‌సెల్వం 138 జయంతి వేడుకలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీవీకే పాలన అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కొనసాగుతోందని,
కొంతమంది అదే పనిగా పనిగట్టుకుని ప్రభుత్వంపై పసలేని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. టీవీకే అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా దాటలేదని, ఆలోగా ఘాటైన విమర్శలు చేయడం అవసరమా? అని ఆమె ప్రశ్నించారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలను కలుసుకుని ధన్యవాదాలు తెలియజేయాలని అనుకున్నానని, కుంభకోణంలో పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని లీమా రోస్ అన్నారు.
ఇదిలా ఉండగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఉంటూ విజయ్ పాలన బాగుందంటూ లీమా రోస్ ప్రశంసించడం పట్ల ఆ పార్టీలోని సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకేను తీవ్రంగా విమర్శలు చేసిన విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపించడం న్యాయమేనా? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నాడు పోరాటం.. నేడు బతుకు ఆరాటం
సినిమా స్టైల్లో చోరీ.. క్షణాల వ్యవధిలో రూ. 5.50 లక్షలు కొట్టేశాడుగా..
Read Latest AP News And Telangana News And International News And Telugu News