ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం
ABN , Publish Date - Jun 02 , 2026 | 06:18 AM
ఏపీ హైకోర్టులో విధులు నిర్వర్తించేందుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ...
రూ. 1.10 లక్షలు అందించిన హైకోర్టు ఎస్పీఎఫ్ సిబ్బంది
హైకోర్టు విధులకు వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టులో విధులు నిర్వర్తించేందుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపీఎస్పీఎఫ్) హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీనివాసులు కుటుంబానికి హైకోర్టు యూనిట్ సిబ్బంది అండగా నిలిచారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకొనేందుకు ఏపీ హైకోర్టు ఎస్పీఎఫ్ యూనిట్ సిబ్బంది అందరూ కలిసి రూ. 1.10 లక్షలు సమీకరించారు. ఈ మొత్తాన్ని ఏపీఎస్పీఎఫ్ విజయవాడ జోన్ కమాండెంట్ ఎం.శంకరరావు, హైకోర్టు యూనిట్ అసిస్టెంట్ కమాండెంట్ కె.శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్లు వి.ప్రసాద్, ఎంవీ శివకుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు సమక్షంలో మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.