Share News

ఇరాన్‌తో డీల్.. కఠిన నిబంధనలు కోరుతున్న ట్రంప్..

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:48 AM

ఇరాన్‌తో కుదుర్చుకోబోయే కొత్త ఒప్పందంలో మరింత కఠిన నిబంధనలు ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబడుతున్నట్టు సమాచారం.

ఇరాన్‌తో డీల్.. కఠిన నిబంధనలు కోరుతున్న ట్రంప్..
Trump Iran deal

ఇరాన్‌తో కుదుర్చుకోబోయే కొత్త ఒప్పందంలో మరింత కఠిన నిబంధనలు ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న ఒప్పందం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో 2015లో కుదిరిన అణు ఒప్పందం (JCPOA)తో అనేక అంశాల్లో పోలికలు కలిగి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు (Trump Iran deal).


2015 అణు ఒప్పందాన్ని ట్రంప్ గతంలో తీవ్రంగా విమర్శించారు. ఆ ఒప్పందం ఇరాన్‌కు ప్రయోజనం చేకూర్చిందని, అణ్వాయుధాల అభివృద్ధిని పూర్తిగా అడ్డుకోలేదని ఆయన పలుమార్లు ఆరోపించారు. అయితే ప్రస్తుతం కుదరిన ఒప్పందం కూడా అదే తరహాలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ అప్రమత్తమైనట్టు సమచారం. పాత ఒప్పందం కంటే కొత్త ఒప్పందం మరింత కఠినంగా ఉండాలని ట్రంప్ కోరుతున్నారు (Iran nuclear agreement).


తాజా చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన నియంత్రణలు (Obama 2015 nuclear deal), అధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వల నిర్వహణ, అలాగే హోర్ముజ్ జలసంధికి సంబంధించిన అంశాలపై అమెరికా అదనపు షరతులు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే సిద్ధమైన ముసాయిదాను ట్రంప్ సవరణల కోసం తిరిగి పంపినట్టు వార్తలు వస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్


బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 02 , 2026 | 11:48 AM