Share News

కర్ణాటకలో సరికొత్త రాజకీయం.. ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు?

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:27 AM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ రేపు(బుధవారం) కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్‌‌లో జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం ఏర్పాట్లు శరావేగంగా సాగుతున్నాయి.

కర్ణాటకలో సరికొత్త రాజకీయం.. ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు?
DK Shivakumar

బెంగళూరు, జూన్ 2: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ రేపు(బుధవారం) కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్‌‌లో జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం ఏర్పాట్లు శరావేగంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ‌తో పాటు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. క్యాబినెట్ విస్తరణ రెండు విడతలుగా జరగనుంది. బుధవారం మొదటి విడత క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. డీకే శివకుమార్‌తో పాటు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.


సిద్దరామయ్య మాస్టర్ ప్లాన్..

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. క్యాబినెట్ విస్తరణ విషయంలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య హైకమాండ్‌కు కీలక సూచనలు చేశారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉండాలని స్పష్టం చేశారు. గత రాత్రి మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలాతో జరిగిన మీటింగ్‌లో ఈ విషయాన్ని సిద్దరామయ్య గట్టిగా చెప్పారు. దళిత వర్గానికి చెందిన జీ పరమేశ్వర, లింగాయత్ వర్గానికి చెందిన ఎంబీ పాటిల్, ముస్లిం వర్గానికి చెందిన జమీర్ అహ్మద్ ఖాన్‌ల పేర్లను హైకమాండ్‌కు సిద్దూ సిఫార్సు చేశారు. అయితే, ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల ప్రతిపాదనను డీకే వ్యతిరేకించినట్లు సమాచారం. తన నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి అవసరం ఏమాత్రం లేదని ఆయన హైకమాండ్‌కు చెప్పినట్టు తెలుస్తోంది.


క్యాబినెట్‌లో వీరికి అవకాశం..

మంత్రుల ఎంపిక విషయంలో సిద్దరామయ్య కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న వారి పేర్లను ఆయన హైకమాండ్‌కు సూచించారని సమాచారం. బుధవారం డీకే శివకుమార్‌తో పాటు ప్రమాణస్వీకారం చేయబోయే వారిలో..

  • యతీంద్ర సిద్దరామయ్య

  • జీ పరమేశ్వర

  • కే.జే.జార్జ్

  • రామలింగారెడ్డి

  • ప్రియాంక్ ఖర్గే

  • ఎంబీ పాటిల్

  • ఈశ్వర్ ఖండ్రే

  • కృష్ణ బైరే గౌడ

  • లక్ష్మీ హెబ్బాళ్కర్

  • బి.సురేశ్

  • సతీశ్ జార్కిహోళి

  • జమీర్ అహ్మద్ ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది.

సతీశ్ జార్కిహోళి కర్ణాటక కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పుకుంటే ఆయన స్థానంలో బీకే హరి ప్రసాద్ మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ ప్లేయర్లను కొంటున్నారు: సునీల్ గావస్కర్

ఉచిత తాగునీటికి రూ.75కోట్లు

Updated Date - Jun 02 , 2026 | 12:06 PM