ఉచిత తాగునీటికి రూ.75కోట్లు
ABN , Publish Date - Jun 02 , 2026 | 10:58 AM
గ్రేటర్ హైదరాబాద్‌లో నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకానికి తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.75కోట్లు విడుదల చేసింది.
వాటర్‌బోర్డుకు ప్రభుత్వం విడుదల
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ హైదరాబాద్‌లో నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకానికి తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.75కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం అమల్లో భాగంగా 6.55 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేస్తున్న వాటర్‌బోర్డుకు 20026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.300కోట్ల కేటాయించారు.
అందుకనుగుణంగా మొదటి త్రైమాసికానికి నిధులు విడుదల చేయాలని వాటర్‌బోర్డు కోరుతూ గత నెల మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మొదటి త్రైమాసికానికి రూ.75కోట్లను వాటర్‌బోర్డుకు విడుదల చేసింది. మరో రూ.225కోట్లను విడుదల చేయాల్సి ఉన్నదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
సినిమా స్టైల్లో చోరీ.. క్షణాల వ్యవధిలో రూ. 5.50 లక్షలు కొట్టేశాడుగా..
Read Latest AP News And Telangana News And International News And Telugu News