అస్సాంలో రోడ్డు ప్రమాదం.. 32 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలు
ABN , Publish Date - Oct 09 , 2026 | 09:01 AM
అస్సాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 32 మంది బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వారిలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒక జవాను పరిస్థితి విషమంగా ఉంది. ఎదురుగా ఉన్న వ్యాన్‌ను జవాన్ల బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బార్పేట జిల్లాలోని హౌలీలో నేషనల్ హైవే 27పై ఈ ప్రమాదం జరిగింది.
ఇంటర్‌నెట్ డెస్క్: అస్సాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 32 మంది బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వారిలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒక జవాను పరిస్థితి విషమంగా ఉంది. ఎదురుగా ఉన్న వ్యాన్‌ను జవాన్ల బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బార్పేట జిల్లాలోని హౌలీలో నేషనల్ హైవే 27పై ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల విధులు నిర్వహించిన 32 మంది బీఎస్ఎఫ్ జవాన్లు తిరిగి బస్సులో ధుబ్రి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో హౌలీలోని నేషనల్ హైవే 27పై ఎదురుగా ఉన్న ట్రక్కును బీఎస్ఎఫ్ జవాన్ల బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడిని శంశూల్ హక్‌గా గుర్తించారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక పనులు చేపట్టారు. గాయపడిన జవాన్లను బార్పేటా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. వారిలో 14 మంది జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు డాక్టర్లు వెల్లడించారని పోలీసులు తెలిపారు. అందులో ఒక జవాను పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆ జవానుకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మస్క్‌కు యూఎస్ సైన్స్ మెడల్ ప్రదానం.. ట్రంప్ కితాబు
దిగ్గజ ఐటీ కంపెనీలపై ట్రంప్ కత్తి
Read Latest National and International news