Share News

మస్క్‌కు యూఎస్ సైన్స్ మెడల్ ప్రదానం.. ట్రంప్ కితాబు

ABN , Publish Date - Oct 09 , 2026 | 07:53 AM

టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ సైన్స్ మెడల్ అందించారు. మస్క్‌తో పాటు మరో ఐదుగురు అమెరికా టెక్ దిగ్గజాలకు కూడా ట్రంప్ ఆ అవార్డును అందించి గౌరవించారు. వాషింగ్టన్ పీస్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘సైన్స్: అ నివ్ గోల్డెన్ ఏజ్’ పేరుతో పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది.

మస్క్‌కు యూఎస్ సైన్స్ మెడల్ ప్రదానం.. ట్రంప్ కితాబు
trump praising musk

ఇంటర్‌నెట్ డెస్క్: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ సైన్స్ మెడల్ అందించారు. మస్క్‌తో పాటు మరో ఐదుగురు అమెరికా టెక్ దిగ్గజాలకు కూడా ట్రంప్ ఆ అవార్డును అందించి గౌరవించారు. వాషింగ్టన్ పీస్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘సైన్స్: అ నివ్ గోల్డెన్ ఏజ్’ పేరుతో పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ మస్క్‌పై ప్రశంసలు కురిపించారు. మస్క్‌ను జాతి సంపదగా అభివర్ణించారు. అంతేకాకుండా ఆయనను ఆధునిక కాలపు థామస్ ఎడిసన్ అని కొనియాడారు. ‘‘ఎలాన్.. నీకు నేను అభినంనదలు తెలపాలనుకుంటున్నా. నువ్వు నా స్నేహితుడివి. అన్నింటికన్నా ముఖ్యంగా నువ్వు స్పెషల్. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో ఇద్దరు కూడా ఒకరి కళ్లలో ఒకరు చూసుకోలేదు. ఎడ మొహం, పెడ మొహం అన్నట్లు గడిపారు.


కాగా.. మస్క్‌తో పాటు గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్, ఎన్‌విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఏఎండీ చీఫ్ లిసా సు.. నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డును అందుకోగా.. కంప్యూటర్ మొగల్ మైకేల్ డెల్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ పురస్కారాన్ని అందుకున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి 2025లో ట్రంప్ ప్రవేశపెట్టిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్స్ (డోగ్) లో ఎలాన్ మస్క్ కొంతకాలం హెడ్‌గా పనిచేశారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ట్రంప్ దీనిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఓవల్ ఆఫీసులో జరిగిన పలు క్యాబినెట్ సమావేశాల్లో ట్రంప్ పక్కన మస్క్ కనిపించారు. అంతేకాకుండా ఒకసారి తన చిన్న కుమారుడు ఎక్స్‌ను కూడా తీసుకొచ్చారు.


అయితే, డోగ్‌ను వ్యతిరేకిస్తూ ఆ తర్వాత మస్క్ బయటకు వచ్చారు. దీంతో ట్రంప్, మస్క్ మధ్య సంబంధాలు క్షీణించాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయని మస్క్ ఆరోపించారు. దీంతో ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దక్షిణాఫ్రికాలో పుట్టిన మస్క్‌ను అమెరికా నుంచి వెళ్లగొడతానని ట్రంప్ బెదిరించే వరకూ వారి మధ్య మాట యుద్ధం కొనసాగింది. అయితే, ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్య మళ్లీ సంబంధాలు మెరుగయ్యాయి. గత నెల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ట్రంప్ ఇచ్చిన ఆతిథ్యంలో మస్క్ పాల్గొన్నారు. అలాగే గత వారం వైట్ హౌస్‌లో అధ్యక్షుడితో ఆయన భేటీ అయ్యారు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌పై చర్చించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

దిగ్గజ ఐటీ కంపెనీలపై ట్రంప్‌ కత్తి

భారత టెలికాం దిగ్గజాలపై మస్క్ ఆరోపణలు

Read Latest National and International news

Updated Date - Oct 09 , 2026 | 08:01 AM