స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు.. భారత టెలికాం దిగ్గజాలపై మస్క్ ఆరోపణలు..
ABN , Publish Date - Oct 08 , 2026 | 08:02 AM
భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశాన్ని కొందరు అడ్డుకుంటున్నారని స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆరోపించారు. తమ మార్కెట్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికే స్టార్‌లింక్‌కు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
Elon Musk Starlink India: భారత్‌లో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల రంగానికి సంబంధించిన ప్రముఖ వ్యాపారవేత్త, స్పేస్‌ఎక్స్ (SpaceX) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశించకుండా మార్కెట్‌ను శాసించే కొందరు బడా కుబేరులు అడ్డుకుంటున్నారని, ఇది భారత ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరమని సంచలన ఆరోపణలు చేశారు. ఎక్స్ (X) వేదికగా స్పందించిన మస్క్.. పేరు ప్రస్తావించకుండానే భారతదేశ టెలికాం రంగాన్ని శాసిస్తున్న బడా పారిశ్రామికవేత్తలపై ఘాటుగా విరుచుకుపడ్డారు.
'దురదృష్టవశాత్తూ, భారత ప్రజలపై తమకున్న ఏకఛత్రాధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం కొందరు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు. వారు ఎవరో మీరు ఊహించవచ్చు... ఇది భారత ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరం!' అని ఎలాన్ మస్క్ అన్నారు. ప్రస్తుత ప్లాన్ల ధరలను భరించలేని వారికి, ఇంటర్నెట్ సదుపాయమే లేని మారుమూల ప్రాంతాల వారికి స్టార్‌లింక్ ద్వారా అత్యంత వేగవంతమైన, సరసమైన ఇంటర్నెట్‌ను అందించవచ్చని మస్క్ పేర్కొన్నారు.
గతంలోనే స్టార్‌లింక్ భారత్‌లో 20 గేట్‌వే సైట్లను సిద్ధం చేసినప్పటికీ, లైసెన్సింగ్ ప్రక్రియను, స్పెక్ట్రమ్ కేటాయింపులను ఈ కార్పొరేట్ శక్తుల ఒత్తిడి వల్లే ఆలస్యం చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
జోరుగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు
చికిత్సకు ముందు-తర్వాత ప్రచారం ఇక కుదరదు!
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘4ఈ’ అస్త్రం
Read Latest AP News And Telugu News