Home » Airtel 5G
నెట్‌వర్క్ కేబుల్ వైర్ల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రామంతాపూర్ ఘటన తర్వాత హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు కట్ చేశారు. వైర్లకు తిరిగి కనెక్షన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఎయిర్‌టెల్ సంస్థ కోరింది. అయితే, ఎయిర్‌టెల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఇటీవల రామంతాపూర్‌లో విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్లను అధికారులు కట్ చేసిన అనంతరం మరోసారి ఈ కేసు హైకోర్టు విచారణకు రానుంది. తిరిగి కనెక్షన్లకు అనుమతించాలని కోరుతూ టెలికాం ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది.
విద్యుత్ స్తంభాలకు అనుసంధానంగా ఉన్న ఎయిర్‌టెల్ ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల తొలగింపు ప్రక్రియను నిలిపేయాలంటూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఎయిర్‌టెల్ నెట్ వర్క్ అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఈ మధ్యాహ్నం వేలాది మంది ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లు సర్వీస్ అంతరాయాలపై కంప్లైంట్లు చేశారు. ఫోన్ కాల్స్, డేటా యాక్సెస్ చేయలేకపోతున్నామని..
స్వాతంత్ర్య దినోత్సవ నెలలో బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్‌తో ముందుకొచ్చింది. కేవలం ఒకే ఒక్క రూపాయి ఖర్చుతో నెల రోజులపాటు ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ డేటా ప్లాన్ తీసుకొచ్చింది.
2024 జులైలో టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచాయి. ఏడాదిగా అవే ప్లాన్లు కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలలో 5జీ నెట్‌వర్క్‌కు అనువుగా ధరల పెంపు ఉండొచ్చని జెఫ్రీస్ అంచానా వేస్తోంది.
మొబైల్ ఫోన్ వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా టెలికమ్యూనికేషన్ల విభాగం కీలక నిర్ణయం తీసుకొంది. ప్రీపెయిడ్ ప్లాన్..పోస్టు పెయిడ్ ప్లాన్‌ల మధ్య మార్పిడిని సులభతరం చేసింది.
తెలంగాణలోని ఎయిర్‌టెల్ కస్టమర్లు సైబర్ మోసాలకు గురి కాకుండా సదరు సంస్థ అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. AI-ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.4 మిలియన్‌కు పైగా వినియోగదారులను రక్షించింది. కేవలం 25 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.
దేశంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో రూ.399కే బ్రాడ్‌బ్యాండ్, టీవీ సేవలతో పాటు అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందించనున్నట్లు తెలిపింది.
ఇండియన్ మార్కెట్లో అతి త్వరలో మరో భారీ డీల్ కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్ ఈ డీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది..