Airtel : ఎయిర్‌టెల్ డౌన్: నో కాల్స్.. నో ఇంటర్నెట్ డేటా యాక్సెస్
ABN , Publish Date - Aug 18 , 2025 | 07:40 PM
ఎయిర్‌టెల్ నెట్ వర్క్ అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఈ మధ్యాహ్నం వేలాది మంది ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లు సర్వీస్ అంతరాయాలపై కంప్లైంట్లు చేశారు. ఫోన్ కాల్స్, డేటా యాక్సెస్ చేయలేకపోతున్నామని..
ఇంటర్నెట్ డెస్క్ : ఎయిర్‌టెల్ సర్వీస్ అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఈ (సోమవారం) మధ్యాహ్నం వేలాది మంది ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లు సర్వీస్ అంతరాయాలపై కంప్లైంట్లు చేశారు. చాలా మంది ఫోన్ కాల్స్ చేయలేకపోతున్నామని, మొబైల్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నామని ఫిర్యాదు చేశారు. అవుట్‌టేజ్ ట్రాకర్ డౌన్ డిటెక్టర్ ప్రకారం, మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదుల పరంపర మొదలైంది.
డౌన్ డిటెక్టర్ ప్రకారం, దాదాపు 71% మంది వినియోగదారులు కాల్స్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదించగా, 15% మంది ఇంటర్నెట్ కనెక్టివిటీని ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. మిగిలిన 14% మంది తమ ఎయిర్‌టెల్ నంబర్లలో సిగ్నల్ లేదని ఫిర్యాదు చేశారు. అయితే, డౌన్‌టైమ్ వల్ల ప్రభావితమైన కచ్చితమైన ప్రాంతాలు లేదా సర్కిల్‌లు ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, దీనిపై టెలికాం కంపెనీ నుండి అధికారిక నిర్ధారణ లేదు. చాలా మంది సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం X ద్వారా తమ సమస్యను లేవనెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాకాణి గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్
కేంద్రమంత్రులతో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే..
Read Latest AP News And Telugu News