కెనడా రచయిత్రి ఆన్ కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్..
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:45 PM
కెనడాకు చెందిన ప్రముఖ కవయిత్రి, వ్యాసకర్త ఆన్ కార్సన్‌ను 2026 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి వరించింది. సాహసోపేతమైన, వినూత్న సాహిత్య రచనలకు గాను 76 ఏళ్ల కార్సన్‌ను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ గురువారం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: కెనడాకు చెందిన ప్రముఖ కవయిత్రి, వ్యాసకర్త ఆన్ కార్సన్‌ను 2026 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి వరించింది. సాహసోపేతమైన, వినూత్న సాహిత్య రచనలకు గాను 76 ఏళ్ల కార్సన్‌ను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ గురువారం ప్రకటించింది. సాంప్రదాయ సాహిత్యంతో ఆధునిక సాహిత్యానికి కొత్తదనం అద్దిన కార్సన్ ఈ అవార్డుకు అర్హురాలని పేర్కొంది (Anne Carson Nobel Prize).
కెనడాలోని టొరంటోలో జన్మించిన ఆన్ కార్సన్ రచనల్లో ప్రాచీన గ్రీకు, రోమన్ సాహిత్య ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె కవిత్వం, వ్యాసాలు, గద్య రచనలు, అనువాదాలను కలిపి ప్రత్యేకమైన రచనా శైలిని అభివృద్ధి చేశారు. ప్రాచీన గ్రీకు సాహిత్యాన్ని అనువదించడంలోనూ కార్సన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పదాల మూలాలు, భాష, కవిత్వం మధ్య సంబంధాన్ని ఆమె రచనల్లో విభిన్నమైన రీతిలో ఆవిష్కరించారు (Nobel Prize in Literature 2026).
'ఆటోబయోగ్రఫీ ఆఫ్ రెడ్', 'ఎరోస్ ది బిటర్‌స్వీట్', 'మెన్ ఇన్ ది ఆఫ్ అవర్స్', 'నార్మా జీన్ బేకర్ ఆఫ్ ట్రాయ్' వంటివి కార్సన్ రచనల్లో ప్రముఖమైనవి (Anne Carson books). కవిత్వం, గద్యరచన, నాటకం, అనువాదం వంటి విభిన్న సాహిత్య ప్రక్రియలను కలిపి ఆమె రచనలు సాగుతాయి. కాగా, 2026 సాహిత్య నోబెల్ బహుమతి విజేతకు 12 మిలియన్ స్వీడిష్ క్రోనర్ నగదు పురస్కారం అందిస్తారు. ఇది సుమారు 1.2 మిలియన్ అమెరికన్ డాలర్లకు సమానం. మన కరెన్సీలో రూ.10 కోట్లకు పైగానే ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన.. మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిపై దాడి..
సెన్సెక్స్ 1,100 పాయింట్లు పతనం.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి..