76 ఏళ్ల వయసులో 15 ట్రైసెప్ డిప్స్.. నానా పటేకర్ ఫిట్‌నెస్ వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:05 PM
ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 76 ఏళ్ల వయసులో ఆయన జిమ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా 15 ట్రైసెప్ డిప్స్ చేయడం ఈ వీడియోలో కనిపించింది. ఫోటోగ్రాఫర్, నిర్మాత అతుల్ కాస్బేకర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు (Nana Patekar fitness).
వీడియోలో నానా పటేకర్ సాధారణ దుస్తుల్లో, మెడలో తువ్వాలు వేసుకుని ట్రైసెప్ డిప్స్ చేస్తున్నారు. వ్యాయామం పూర్తయిన తర్వాత కెమెరా వైపు చూసి చిరునవ్వు నవ్వారు. తాను రికార్డింగ్‌ను ఆలస్యంగా ప్రారంభించానని, నానా మొత్తం 15 డిప్స్ చేశారని ఆ వీడియోలో అతుల్ కాస్బేకర్ తెలిపారు. అప్పట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. 70 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా నానా ఇంత సులభంగా వ్యాయామం చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు (Nana Patekar workout).
నటి శిల్పా శెట్టి, నటుడు రాహుల్ దేవ్ సహా పలువురు ప్రముఖులు కూడా ఈ వీడియోపై స్పందించారు (Nana Patekar viral video). తాజాగా ఈ పాత వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. నానా ఫిట్‌నెస్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, నానా పటేకర్ ఇటీవల 'ఓ రోమియో' చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్, తృప్తి డిమ్రీతో కలిసి ఆయన నటించారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన.. మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిపై దాడి..
సెన్సెక్స్ 1,100 పాయింట్లు పతనం.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి..