Share News

సెన్సెక్స్ 1,100 పాయింట్లు పతనం.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి..

ABN , Publish Date - Oct 08 , 2026 | 02:21 PM

దేశీయ స్టాక్ మార్కెట్‌ గురువారం భారీగా పతనమైంది. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సెన్సెక్స్‌ 1100 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.8 లక్షల కోట్ల మేర తగ్గింది.

సెన్సెక్స్ 1,100 పాయింట్లు పతనం.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి..
Sensex today

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్‌ గురువారం భారీగా పతనమైంది. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సెన్సెక్స్‌ 1100 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.8 లక్షల కోట్ల మేర తగ్గింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి (Stock Market Today).


మార్కెట్ పతనానికి ప్రధాన కారణాల్లో ముడి చమురు ధరల పెరుగుదల కూడా ఒకటి. మధ్యప్రాచ్యంలో సరఫరాకు సంబంధించిన ఆందోళనలు కొనసాగడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర 3.9 శాతం పెరిగి బ్యారెల్‌కు 104.09 డాలర్లకు చేరింది. మరోవైపు ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చడం కూడా ప్రతికూలంగా మారింది (RBI repo rate).


విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారత ఈక్విటీల్లో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 7న ఎఫ్‌ఐఐలు సుమారు రూ.6,121 కోట్ల విలువైన భారత ఈక్విటీలను విక్రయించారు (FII selling). ఎఫ్‌ఐఐల నిరంతర అమ్మకాలు కొనసాగితే మార్కెట్‌పై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 5.3 శాతం ప్రాంతానికి చేరడం కూడా ప్రపంచ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది. డాలర్ బలపడటంతో రూపాయి కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది.


మార్కెట్‌ పతనం కారణంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రియల్టీ, లోహాలు, ఆటో తదితర రంగాల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. దాదాపు అన్ని రంగాలూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి. అధిక విలువల వద్ద ఉన్న కొన్ని షేర్లలో కూడా భారీగా లాభాల స్వీకరణ జరిగింది.


ఇవి కూడా చదవండి...

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన అంశాలివే

తెలంగాణను బీజేపీ టార్గెట్ చేసింది.. 92 లక్షల ఓట్లు తొలగించారంటూ మహేశ్ ఆరోపణలు

Updated Date - Oct 08 , 2026 | 02:26 PM