Share News

ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన.. మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిపై దాడి..

ABN , Publish Date - Oct 08 , 2026 | 03:32 PM

ఢిల్లీలో కొనసాగుతున్న ప్రతిపక్షాల నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా నినాదాలు చేసిన ఓ వ్యక్తిపై కొందరు నిరసనకారులు దాడి చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని కనాట్ ప్లేస్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన.. మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిపై దాడి..
Pro Modi slogan

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో కొనసాగుతున్న ప్రతిపక్షాల నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా నినాదాలు చేసిన ఓ వ్యక్తిపై కొందరు నిరసనకారులు దాడి చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని కనాట్ ప్లేస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు, ఇతర కార్యకర్తలు నిరసన నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది (Pro Modi slogan).


నిరసన ప్రాంతానికి సమీపంలో ఓ వ్యక్తి ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉన్న కొందరు అతడిని అడ్డుకున్నారు. అనంతరం అతడిపై దాడి చేశారు. అతడిని కొట్టడంతో పాటు దుస్తులు కూడా చించివేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విడిచిపెట్టారు. ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (Modi slogan man beaten Delhi).


మోదీకి అనుకులంగా నినాదాలు చేసిన వ్యక్తిపై కాంగ్రెస్ దాడి చేయడాన్ని బీజేపీ ఖండించింది (Rahul Gandhi protest). 'కాంగ్రెస్ కార్యకర్తల తీరు సిగ్గుచేటు! ఒక భారత పౌరుడు ప్రధాని నరేంద్రమోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తే, కాంగ్రెస్ కార్యకర్తలు అతణ్ని చుట్టుముట్టి కొట్టారు' అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి 'ఎక్స్' ద్వారా స్పందించారు.


ఈ వార్తలూ చదవండి

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత..

రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.. నానా పటేకర్ చివరి కామెంట్స్

Updated Date - Oct 08 , 2026 | 03:51 PM