Share News

రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.. నానా పటేకర్ చివరి కామెంట్స్

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:33 AM

ప్రముఖ నటుడు నానా పటేకర్ హఠాన్మరణంతో అభిమానులు శోకసంద్రంలో కూరుకుపోయారు. నాలుగు రోజుల క్రితం ఆయన అన్న మాటలను గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.

రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.. నానా పటేకర్ చివరి కామెంట్స్
Veteran Actor Nana Patekar Passes Away

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ హఠాన్మరణంతో సినీఅభిమానులు శోకసంద్రంలో కూరుకుపోయారు. గోవాలో దోనా పౌలా ప్రాంతంలోని తన నివాసంలో గురువారం ఆయన గుండెపోటుతో మరణించారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఆయన అన్నమాటలను అభిమానులు గుర్తు చేసుకుని కుమిలిపోతున్నారు. ‘ఈ రోజు మీ ముందు ఉన్నా.. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు..?’ అని నానా పటేకర్ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.


అక్టోబర్ 4న గోవాలో సామ్రాట్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నానా పటేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలో ఎన్నటికీ తప్పించలేని అనిశ్చితి గురించి మాట్లాడారు. రేపు ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదని చెప్పారు. ‘మనం ఇతరులకు వీలైనంత సేవ చేయాలి. ఎందుకంటే మనం వెంట తీసుకెళ్లేది ఏమీ ఉండదు. జీవితాన్ని ఎవరైనా సరే ఇలాగే గడపాలి’ అని వ్యాఖ్యానించారు.


ఆ కార్యక్రమంలో నానా పటేకర్ మనసులోని భావాలను యథాతథంగా పంచుకున్నారని మాజీ ఎంపీ నరేంద్ర సవైకర్ అన్నారు. ఇతరులపై సెటైర్లు పేల్చుతూ.. అక్కడి నాట్య బృందంతో కలిసి చిందేసి సరదాగా గడిపారని అన్నారు. నానా పటేకర్ మాటలు నిజమై ఆయన దూరం కావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరవుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

గగనతలంలో ఉండగా విమానంపై పిడుగుపాటు

ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. గర్భిణీ సహా బాలిక మృతి

Updated Date - Oct 08 , 2026 | 11:44 AM