ఉక్రెయిన్-రష్యా మధ్య భారత్ మధ్యవర్తిత్వం!
ABN , Publish Date - Oct 09 , 2026 | 04:54 AM
వెంటనే ముగిసిపోతుందనుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగున్నరేళ్లుగా (2022 ఫిబ్రవరి నుంచి) మానని గాయంలా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ ఓ అడుగు ముందుకు వేయడానికి సముఖంగానే ఉన్నా..
తుర్కియే, ఈజిప్ట్, యూఎస్ సైతం ఆసక్తి
ఈ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు ప్రతిపాదనలు
కీవ్, అక్టోబర్ 8: వెంటనే ముగిసిపోతుందనుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగున్నరేళ్లుగా (2022 ఫిబ్రవరి నుంచి) మానని గాయంలా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ ఓ అడుగు ముందుకు వేయడానికి సముఖంగానే ఉన్నా.. రష్యా వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఈ తరుణంలో మధ్యవర్తిత్వానికి భారత్ ముందుకు రావడం ప్రపంచ దేశాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణకు భారత్, తుర్కియే, ఈజిప్ట్, అమెరికా ప్రతిపాదనలు చేసినట్లు తుర్కియే విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహా ప్రకటించారు. ఇందులో భారత్ చేసిన ప్రతిపాదన మిగిలిన వాటికంటే సమగ్రంగా ఉందన్నారు. కీలక పాత్ర పోషించేందుకు భారత్ మొదటిసారి ఆసక్తి చూపించినట్లు చెప్పారు. అయితే, ఈ ప్రతిపాదనల్లో ఏ ఒక్కటీ యుద్ధా న్ని పూర్తిగా ముగించేందుకు ఉద్దేశించినవి మాత్రం కావు. పోర్టులు వంటి మౌలిక సదుపాయాలపై పరస్పర దాడులను నిలిపివేయడం, నల్ల సముద్రం ద్వారా ధాన్యం, ఇంధన సరఫరాలు సాఫీగా సాగిపోయేలా చూడడం.. వాణిజ్య నౌకలకు భద్రత కల్పించడం భారత్ చేసిన ప్రతిపాదనల్లో భాగంగా ఉంది. కాగా, తూర్పు ఉక్రెయిన్‌లో ఓ ప్రజా రవాణా బస్సుపై రష్యా జరిపిన దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 18 మంది గాయపడ్డారు. డొనెటెస్క్ రీజియన్‌లోని క్రమటార్స్‌లో ఈ దాడి జరిగిందని అధికారులు గురువారం ప్రకటించారు.