Share News

ఇంటి భోజనమూ ప్రియమే!

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:00 AM

ఇంట్లో వండుకునే సాదాసీదా భోజనం కూడా సామాన్యుడికి భారంగా మారుతోంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వల్ల ఇంటి భోజన వ్యయం కూడా పెరుగుతోందని ఓ సర్వే వెల్లడించింది.

ఇంటి భోజనమూ ప్రియమే!

  • గత ఏడాదితో పోలిస్తే 10శాతం పెరిగిన ఖర్చు

  • ఉల్లి ధర ఏకంగా 89శాతం పెంపు: క్రిసిల్‌ రిపోర్టు

ముంబై, అక్టోబరు 8: ఇంట్లో వండుకునే సాదాసీదా భోజనం కూడా సామాన్యుడికి భారంగా మారుతోంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వల్ల ఇంటి భోజన వ్యయం కూడా పెరుగుతోందని ఓ సర్వే వెల్లడించింది. ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ విడుదల చేసిన ‘రైస్‌ రోటీ రేట్‌’ సెప్టెంబర్‌ నెల నివేదిక.. శాఖాహార భోజనం ఖర్చు గతేడాదితో పోలిస్తే ఏకంగా 10శాతం పెరిగిందని వెల్లడించింది. ఉల్లిపాయలు, వంటనూనె, బియ్యం, ఎల్పీజీ గ్యాస్‌ ధరలు ఒక్కసారిగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. ఇక బ్రాయిలర్‌ చికెన్‌ ధరలు కొంచెం నెమ్మదిగా పెరగడంతో మాంసాహార భోజన వ్యయం 6శాతం మేర పెరిగి నాన్‌వెజ్‌ ప్రియులకు కొంత ఉపశమనం లభించిందని తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో సగటున రూ. 28గా ఉన్న శాఖాహార భోజన ఖర్చు ఈ ఏడాది రూ. 30కి చేరగా, మాంసాహార భోజన వ్యయం రూ.56 నుంచి రూ.59 పెరిగింది. ఇక, నెలవారీగా చూస్తే, సెప్టెంబర్‌లో (ఆగస్టుతో పోలిస్తే) శాఖాహారం 4శాతం, మాంసాహార భోజనం 3శాతం ప్రియమయ్యాయి.


కొండెక్కిన నిత్యావసరాలు

గతేడాది కిలో రూ. 28గా ఉన్న ఉల్లి ధరలు ఏకంగా 89శాతం పెరిగి రూ. 53కి చేరుకున్నాయని నివేదిక పేర్కొంది. ఈ సీజన్‌లో పంట ఉత్పత్తి తగ్గడం.. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌ సాగు ఆలస్యమై మార్కెట్‌లోకి కొత్త పంట రాకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. పండగల సీజన్‌ సమీపిస్తున్న తరుణంలో ఉల్లి ధరలు మ రింత మండే అవకాశం ఉందని, ఈ నెలాఖరుకు కొత్త పంట మార్కెట్‌లోకి వస్తేనే కాస్త ఉపశమనం లభిస్తుందని స్పష్టంచేసింది. వీటితో పాటు అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల వంట నూనెల ధరలు 12శాతం, సాగువిస్తీర్ణం తగ్గి బియ్యం ధరలు 8ు, సరఫరా సమస్యలతో ఎల్పీజీ ధరలు 10శాతం మేర పెరిగాయని తెలిపింది.

Updated Date - Oct 09 , 2026 | 05:01 AM