హరియాణాలో విషాదం.. బోరుబావిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి
ABN , Publish Date - Sep 28 , 2026 | 09:11 AM
హరియాణాలోని ఫరీదాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: తోటి పిల్లలతో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడి మృతి చెందింది. ఈ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రామ్‌దిన్ అనే వ్యక్తి తన భార్య, కుమార్తె నేహా(3)లతో కలిసి హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాకు వలస వెళ్లారు. ఆదివారం భార్యాభర్తలిద్దరూ కూలీ పనులకు వెళ్లగా.. చిన్నారి నేహా ఇంటి ముందు నిలిపిన ట్రాక్టర్ ఎక్కి తోటి పిల్లలతో ఆడుకుంటోంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ కాలుజారి పక్కనే ఉన్న 200 అడుగుల బోరుబావిలో పడిపోయింది నేహా. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. దాదాపు 10 గంటల రెస్య్కూ ఆపరేషన్ తర్వాత నేహాను వెలికితీశాయి. కానీ అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ వార్తలు చదవండి
కాలిఫోర్నియాలో వెంకట్ నాగం ’రచ్చబండ చర్చలు’, ’కలగూర గంప పుస్తకాల’ ఆవిష్కరణ
హుషారుగా ఫిలడెల్ఫియా మైదానంలో తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్
Read Latest NRI News And AP News And International News And Telugu News