Share News

హుషారుగా ఫిలడెల్ఫియా మైదానంలో తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:33 AM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో వరుసగా ఆయా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీన ఆల్బర్ట్ సి మిల్లర్ పార్క్ వేదికగా నిర్వహించిన మొట్టమొదటి తానా మిడ్-అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌కు అపూర్వ స్పందన వచ్చింది.

 హుషారుగా ఫిలడెల్ఫియా మైదానంలో తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్
Philadelphia Women Cricket

ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో వరుసగా ఆయా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీన ఆల్బర్ట్ సి మిల్లర్ పార్క్ వేదికగా నిర్వహించిన మొట్టమొదటి తానా మిడ్-అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌కు అపూర్వ స్పందన వచ్చింది.

NRI-3.jpg


వివిధ టీములు ఈ టోర్నమెంటులో పాల్గొని క్రీడాస్ఫూర్తిని, ప్రతిభను చాటాయి. మ్యాచ్‌లను సజావుగా, నిష్పాక్షికంగా నిర్వహించిన అంపైర్లు సురేశ్ యలమంచి, వెంకటేశ్ జాగర్లమూడి, శ్రీధర్ సాదినేని, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, వినీత్ తుమ్మల, స్వర్జీత్ లకిమిడ్ అట్లాంటిక్ తానా టీమ్ అభినందనలు తెలిపింది.

NRI-4.jpg


ఈ ఈవెంట్‌ను తొలి నుంచి ముందుండి నడిపిస్తూ, పూర్తిస్థాయి సమన్వయాన్ని, మద్దతును అందించిన మహిళా కోఆర్డినేటర్ దీప్తి కోక సేవలను నాయకులు ప్రత్యేకంగా కొనియాడారు.

తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, సతీశ్ తుమ్మల టోర్నమెంటులో పాల్గొని క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.

రోజంతా సేవలు అందించిన బృంద సభ్యులు సురేశ్ యలమంచి, సునీల్ కోగంటి, చలం పావులూరి, రంజిత్ మామిడి, ప్రసాద్ క్రొత్తపల్లి, కృష్ణ నందమూరి, గోపి వాగ్వాల, శ్రీధర్ సాదినేని, కట్టా చైతన్య, క్రిషిత నందమూరిలను ఆయన అభినందించారు.

NRI-1.jpg


ఈ టోర్నమెంట్‌కు ఉదారంగా స్పాన్సర్‌షిప్ అందించిన రామకృష్ణ తాడిశెట్టికి ధన్యవాదాలు తెలిపారు.

తొలి మహిళల క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ, తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ చావ అభినందించారు.

NRI-3.jpg


విజేతలు వీరే..

ఛాంపియన్స్: పవర్ బ్లేజెస్

రన్నరప్: టైటాన్స్

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: ఐశ్వర్య లచగరి

బెస్ట్ బ్యాటర్: నిత్య కేశవ

బెస్ట్ బౌలర్: ప్రియాంక రామిశెట

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అజంతా తాడూరి

బెస్ట్ వాలంటీర్ ఆఫ్ ది డే: క్రిషిత నందమూరి

NRI.jpg


ఈ వార్తలు చదవండి

తానా మిడ్-అట్లాంటిక్ ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ విజయవంతం

డల్లాస్‌లో నేడు పవన్‌ కల్యాణ్ జన్మదిన వేడుకలు

Read Latest NRI News And AP News And International News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 11:56 AM