Share News

డల్లాస్‌లో నేడు పవన్‌ కల్యాణ్ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Sep 02 , 2026 | 08:47 AM

డల్లాస్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలకు అభిమానులు సిద్ధమవుతున్నారు.

డల్లాస్‌లో నేడు పవన్‌ కల్యాణ్ జన్మదిన వేడుకలు
Pawan kalyan Birthday Celebrations

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలకు డల్లాస్‌లో అభిమానులు సిద్ధమయ్యారు. డల్లాస్ పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న ది కాలనీలోని Twisted Bar & Grillలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. పవర్‌స్టార్ అభిమానులంతా ఒకే కుటుంబంగా కలిసి ఈ వేడుకలను ఉత్సాహభరితంగా జరుపుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా కేక్ కటింగ్, డీజే నైట్, సంగీతం, డ్యాన్స్‌తో పాటు పలు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరయ్యే అభిమానులంతా నలుపు రంగు దుస్తులు ధరించాలని నిర్వాహకులు కోరారు. డల్లాస్‌లోని పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రవేశం పూర్తిగా ఉచితమని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Sep 02 , 2026 | 08:58 AM