Share News

తానా మిడ్-అట్లాంటిక్ ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ విజయవంతం

ABN , Publish Date - Sep 03 , 2026 | 09:14 PM

అమెరికాలో తానా మిడ్-అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగువారి నుంచి విశేష స్పందన లభించింది.

తానా మిడ్-అట్లాంటిక్ ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ విజయవంతం
TANA Mid-Atlantic Will and Trust Drive

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో కమ్యూనిటీకి ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆగస్టు 29వ తేదీన ఫిడెల్ఫియాలోని కింగ్ ఆఫ్ ప్రష్యాలో తానా మిడ్ అట్లాంటిక్ విభాగం ఏర్పాటు చేసిన ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి 60 మందికి పైగా హాజరై వివరాలను తెలుసుకున్నారు. తానా సభ్యులతో పాటు సభ్యులు కాని వారికి కూడా ఇందులో ప్రవేశాన్ని కల్పించారు.


‘చుగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్’ వారు ఉదారంగా ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించడమే కాకుండా, ఉచితంగా తమ ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ ప్లాన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారని తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు తెలిపారు. ఈ కార్యక్రమంలో విల్ అండ్ ట్రస్ట్ ప్రాముఖ్యాన్ని తెలియజేశారు.

NRI-3.jpg

ఈ ఈవెంట్‌ను ఎంతో పక్కాగా ప్లాన్ చేసి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమర్థవంతంగా నిర్వహించారు. పాల్గొన్న కుటుంబాలకు ప్రత్యేక సమయ స్లాట్‌లను కేటాయించి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రక్రియ పూర్తయ్యేలా చూశారు.

NRI-2.jpg


కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడంతోపాటు విజయవంతం చేసిన తానా మిడ్ అట్లాంటిక్ టీమ్‌ను తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి అభినందించారు. అలాగే, ‘చుగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్’ ద్వారా సమాజానికి నిరంతరం సేవలు అందిస్తూ, ఈ ఈవెంట్‌కు ఉదారంగా స్పాన్సర్‌షిప్ అందించిన సతీష్ నల్లాను ఆయన సత్కరించారు.

Nri-1.jpg

ఈ కార్యక్రమ విజయానికి విశేష సహకారం, సేవలు అందించిన రంజిత్ మామిడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు ఈ కార్యక్రమం చక్కగా విజయవంతమయ్యేందుకు మార్గదర్శకత్వం చేశారు.

Also Read:

డల్లాస్‌లో నేడు పవన్‌ కల్యాణ్ జన్మదిన వేడుకలు

తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా తొలి ‘5K రన్’కు విశేష స్పందన

Updated Date - Sep 03 , 2026 | 09:14 PM