Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Feb 12 , 2026 | 06:50 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • Feb 12, 2026 21:41 IST

    రేపు తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

    • 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ, సీసీ కెమెరాలతో నిఘా

    • కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర 12 వేలమంది పోలీసులతో భద్రత

    • సాయుధ బలగాలు, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌తో నిఘా

    • వెబ్‌కాస్టింగ్‌ ద్వారా డీజీపీ ఆఫీస్‌ నుంచి ప్రత్యేక పర్యవేక్షణ

    • పాసులు ఉన్నవారికే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ప్రవేశం

    • కౌంటింగ్‌ కేంద్రాల పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు

    • 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు

  • Feb 12, 2026 20:22 IST

    భారత్‌ను అమెరికాకు మోదీ అమ్మేశారు: ఎంపీ రాహుల్‌ గాంధీ

    • నా వ్యాఖ్యలపై వెనక్కి తగ్గను: రాహుల్‌

    • ప్రధాని మోదీ రైతు వ్యతిరేకి: రాహుల్‌

    • గతంలోనూ నల్లచట్టాలు తెచ్చారు: రాహుల్‌

    • భారత వ్యవసాయ మార్కెట్‌ను..

    • అమెరికాకు తాకట్టు పెట్టారు.. ఇది నిజం: రాహుల్‌

    • నాపై సభాహక్కుల ఉల్లంఘన పెట్టినా వెనక్కి తగ్గేది లేదు: రాహుల్‌

    • ఏం చేస్తారో చేసుకోండి.. నిజాలు చెబుతూనే ఉంటా: రాహుల్‌

    పూర్తి కథనం

  • Feb 12, 2026 20:21 IST

    ABN ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

    • అల్లూరి: దబ్బలపాడు సమస్యలపై ABN ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

    • 'హలో సీఎండీ సార్‌.. మా గ్రామానికి కరెంటు లేదండీ' పేరుతో కథనం

    • 7 కి.మీ. వరకు గ్రామాలకు కాలినడకన వెళ్లిన విద్యుత్‌శాఖ అధికారులు

    • దబ్బలపాడులో ఏర్పాటు చేసిన సోలార్ ప్రాంతం పరిశీలించిన అధికారులు

    • ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్న విద్యుత్ శాఖ అధికారులు

  • Feb 12, 2026 19:44 IST

    తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి: సీఎం రేవంత్‌

    • నాకు ఎవరూ పోటీ కారు: సీఎం రేవంత్‌

    • 2029లో జమిలి ఎన్నికలు రానున్నాయి: సీఎం రేవంత్‌

    • పదిన్నరేళ్ల పాటు నేనే సీఎం: రేవంత్‌రెడ్డి

    • ఎన్టీఆర్ జాతీయ నాయకుడు ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు.. జాతీయ సొత్తు: సీఎం రేవంత్

    • ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నా: సీఎం రేవంత్

    • పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ: సీఎం రేవంత్

    • జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు: సీఎం రేవంత్

    పూర్తి కథనం

  • Feb 12, 2026 18:43 IST

    మధ్యప్రదేశ్: మంత్ర విద్యలు చేస్తున్నారనే నెపంతో దంపతుల హత్య

    • సింగ్రౌలి జిల్లా అంతర్యా గ్రామంలో దారుణం

    • పొరుగింటి దంపతులను గొడ్డలితో నరికి చంపిన ఛత్రపతి సింగ్ అనే వ్యక్తి

    • తన ఇంటిపై మంత్ర విద్యలు చేస్తున్నారని అనుమానించిన నిందితుడు

    • దేవుడి పూజల పేరుతో ఇంటికి పిలిచి హత్యకు పాల్పడిన నిందితుడు

  • Feb 12, 2026 17:37 IST

    ఛత్తీస్‌గఢ్: మహిళా జర్నలిస్ట్ హత్య కేసులో వీడిన మిస్టరీ

    • మహిళా జర్నలిస్ట్ హత్య కేసులో 8 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ

    • సల్మా సుల్తానా అనే జర్నలిస్ట్‌ను హత్య చేసిన ఆమె ప్రియుడు

    • 2018 అక్టోబర్‌లో హత్యకు గురైన సల్మా సుల్తానా

  • Feb 12, 2026 17:23 IST

    అంబటి రాంబాబుకు మరోసారి రిమాండ్‌

    • 14 రోజుల రిమాండ్‌ విధించిన స్పెషల్‌ ప్రిన్సిపల్‌ కోర్టు

    • సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో..

    • టికెట్ల బలవంతపు అమ్మకాల కేసులో రిమాండ్‌

    • రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు అంబటి తరలింపు

  • Feb 12, 2026 17:22 IST

    జీహెచ్‌ఎంసీ స్థాయీసంఘ సమావేశం

    • మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌ కార్పొరేషన్లకు తక్షణ పనుల కోసం..

    • రూ.500 కోట్లు చొప్పున కేటాయింపు: జయేష్‌ రంజన్‌

    • విభజన అంశాల్లో అప్పులు, ఆస్తులను నిర్ణయించేందుకు..

    • సీజీజీ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ: జయేష్‌ రంజన్‌

  • Feb 12, 2026 16:24 IST

    సంగారెడ్డి: కాంగ్రెస్‌ అభ్యర్థి షర్ట్‌ కాలర్‌ను సీఐ పట్టుకున్నారు: జగ్గారెడ్డి

    • అందుకే పోలింగ్‌ బూత్‌ దగ్గరికి వెళ్లాల్సివచ్చింది: జగ్గారెడ్డి

    • ఈ ఘటనను నేను నిన్ననే వదిలేశా: జగ్గారెడ్డి

    • BRS సోషల్‌ మీడియాలో నాపై దుష్ప్రచారం: జగ్గారెడ్డి

    • గతంలో పోలీసులపై కేటీఆర్‌, హరీష్‌రావు దుర్భాషలాడారు: జగ్గారెడ్డి

    • కేటీఆర్‌, హరీష్‌ వ్యాఖ్యలపై సమాధానం చెప్పి.. నా గురించి మాట్లాడండి: జగ్గారెడ్డి

  • Feb 12, 2026 16:22 IST

    సంగారెడ్డి: కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డిపై కేసు నమోదు

    • SEC ఆదేశాలతో జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసిన సంగారెడ్డి పోలీసులు

    • ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు

    • జగ్గారెడ్డిపై 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు నమోదు

    పూర్తి కథనం

  • Feb 12, 2026 16:06 IST

    పీఎస్ఎల్ వేలానికి అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు దూరం

    • పాకిస్థాన్-అఫ్గానిస్తాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు

    • పాకిస్థాన్ సూపర్ లీగ్ వేలంలో తమ పేర్లను ఉపసంహరించుకున్న అఫ్గాన్ ప్లేయర్లు

    • వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో నిర్ణయం

  • Feb 12, 2026 15:52 IST

    భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

    • 84 వేల దిగువకు సెన్సెక్స్..

    • సెన్సెక్స్ 558.72 పాయింట్లు (0.66%) పతనమై 83,674.92 వద్ద స్థిరపడింది.

    • నిఫ్టీ 146.65 పాయింట్ల (0.57%) నష్టంతో 25,807.20 వద్ద ముగిసింది.

  • Feb 12, 2026 15:50 IST

    అమెరికాలో జాహ్నవి కందుల రోడ్డుప్రమాదం కేసులో భారీ పరిహారం

    • రూ.262 కోట్ల పరిహారం చెల్లించేందుకు సియాటెల్‌ ప్రభుత్వం అంగీకారం

    • 2023 జనవరి 23 రాత్రి జాహ్నవిని వాహనంతో ఢీకొట్టిన పోలీస్‌ అధికారి

    • తీవ్రగాయాలతో జాహ్నవి కందుల అక్కడికక్కడే మృతి

    • రోడ్డుప్రమాద సమయంలో పోలీస్‌ అధికారి జాత్యాహంకార వ్యాఖ్యలు

    • జాహ్నవి మరణానికి విలువలేదంటూ మాట్లాడిన పోలీస్‌ అధికారి

  • Feb 12, 2026 15:34 IST

    ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

    • కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, రామ్మోహన్‌..

    • అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి వరుస భేటీలు

    • గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఆహ్వానం

    • మామునూర్‌ ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభించాలని రామ్మోహన్‌కు ఆహ్వానం

    పూర్తి కథనం

  • Feb 12, 2026 14:56 IST

    ఏపీ శాసనమండలి బీఏసీ సమావేశం

    • అన్ని పార్టీల సభ్యులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్న బీఏసీ

    • మండలిని ఉ.10 నుంచి మ.1:30 వరకు నడపాలని నిర్ణయం

    • ప్రశ్నోత్తరాలు గరిష్ఠంగా గంటన్నరపాటు నడపాలని నిర్ణయం

    • సభ్యుల ప్రశ్నలు సమాధానాలు క్లుప్తంగా ఇవ్వాలని మండలి చైర్మన్‌ సూచన

  • Feb 12, 2026 14:12 IST

    ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

    • ఏపీ అసెంబ్లీని రేపటికి వాయిదా: స్పీకర్

    పూర్తి కథనం

  • Feb 12, 2026 14:09 IST

    ఏలూరు: ద్వారకాతిరుమల ఆలయ ప్రసాదం కల్తీ

    • 2022-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా అయినట్టు సిట్‌ నివేదిక

    • 2022-24 మధ్య నెయ్యి సరఫరా చేసిన తిరుపతికి చెందిన వినాయక ఏజెన్సీ

    పూర్తి కథనం

  • Feb 12, 2026 13:42 IST

    రాహుల్‌పై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత

    • రాహుల్‌గాంధీ ప్రసంగం నుంచి కొన్ని వ్యాఖ్యలు తొలగించాలని నిర్ణయం

    • లోక్‌సభలో మాట్లాడనున్న కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌

    పూర్తి కథనం

  • Feb 12, 2026 13:30 IST

    హైదరాబాద్‌లో ఇన్‌వాయిస్ పేరుతో భారీ మోసం

    • వెలుగు చూసిన రూ.32 కోట్ల నకిలీ ఇన్‌వాయిస్ మోసం

    • వాణిజ్య పనులశాఖ అధికారుల రూ.32 కోట్లు చేతివాటం

    • సాధారణ వాహన తనిఖీలలో బయటపడిన అసలు నిజాలు

    • సుమారు రూ.75 కోట్లకు పైగా సరకులను ఇన్‌వాయిస్ లేకుండా వాహనాల్లో తరలిస్తున్న కంపెనీ

    • హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తు

  • Feb 12, 2026 13:25 IST

    అమరావతి: జగన్ హెలిపాడ్ భూమిపై అనగాని వ్యాఖ్యలు

    • హెలిపాడ్ భూమి గతంలో రైల్వే భూమి: మంత్రి అనగాని

    • రైల్వే భూమి స్టేటస్‌ కో: మంత్రి అనగాని

    • రైల్వే భూమిలో నిర్మాణాలు చేసే హక్కు లేదు: మంత్రి అనగాని

  • Feb 12, 2026 13:07 IST

    ఏపీ అసెంబ్లీలో విద్యార్థుల సందడి.. సభా కార్యకలాపాల వీక్షణ

    • రాష్ట్ర శాసనసభలో సందడి చేసిన విద్యార్థులు

    • అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించిన సుమారు 150 మంది విద్యార్థులు

    • సభ సాగే తీరు, ప్రజాప్రతినిధుల చర్చలను ఆసక్తిగా గమనించిన విద్యార్థులు

    • విరామ సమయంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లతో మాట్లాడిన విద్యార్థులు

  • Feb 12, 2026 13:03 IST

    రాహుల్‌కు బీజేపీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు

    • రాహుల్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ నోటీసులు

    • నోటీసులు దాఖలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే

    • బడ్జెట్‌పై చర్చలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులపై నిరాధారమైన ఆరోపణలు చేశారని నోటీసులు

    పూర్తి కథనం

  • Feb 12, 2026 12:58 IST

    మావోయిస్ట్ లేఖపై స్పందించిన ఏపీ మంత్రి

    • మావోయిస్ట్‌ బెదిరింపు లేఖ నాకే ముందు వచ్చింది: మంత్రి అనగాని సత్యప్రసాద్

    • బెదిరింపు లేఖపై ఫిర్యాదు: మంత్రి అనగాని

  • Feb 12, 2026 12:53 IST

    భూమి దిశగా దూసుకొచ్చిన స్విఫ్ట్‌ అబ్జర్వేటరీని నిరోధించిన నాసా

    • 585 కి.మీ. నుంచి 400 కి.మీ.కు ఎత్తుకు నియంత్రించిన స్విఫ్ట్‌ అబ్జర్వేటరీ

    • అబ్జర్వేటరీపై కార్యకలాపాలు నిలిపేసి ప్రైవేట్ రీబూస్ట్‌ మిషన్‌

  • Feb 12, 2026 12:45 IST

    హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌

    • విప్‌ జారీ సహా అన్ని అంశాలపై నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం

    • మున్సిపల్‌ ఎన్నికల్లో బాగా పనిచేశారని అభినందించిన కేటీఆర్‌

    • ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్‌

  • Feb 12, 2026 12:39 IST

    ఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

    • మామూనూరు ఎయిర్‌పోర్ట్‌ భూ సేకరణ పూర్తి కావడంతో పనులు చేపట్టాలని వినతి

    • కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌కు పాల్వంచలో స్థలం కేటాయించాం: సీఎం రేవంత్‌రెడ్డి

    • కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌కు సర్వే, ఫీజిబిలిటీ స్టడీ చేపట్టాలి: రేవంత్‌రెడ్డి

    • అంతర్గావ్‌ ఎయిర్‌పోర్ట్‌కు అనుమతులు మంజూరు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

    • ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు అదనంగా 249.82 ఎకరాలు కేటాయించాం: రేవంత్‌రెడ్డి

  • Feb 12, 2026 12:26 IST

    ఢిల్లీ: ఈ నెల 5న స్పీకర్ ఛాంబర్‌లో ఘర్షణపై వీడియో విడుదల

    • వీడియో పోస్ట్ చేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు

    • 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్‌లోకి వెళ్లి అనుచిత వ్యాఖ్యలు: కిరణ్‌ రిజిజు

    • ప్రధానిని ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ తీసిన వీడియో క్లిప్: కిరణ్‌ రిజిజు

    • బీజేపీ చర్చలను నమ్ముతుంది: కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు

    • భౌతికంగా ఎంపీలను బెదిరించడాన్ని ఎప్పుడూ ప్రోత్సహించదు: కిరణ్‌ రిజిజు

  • Feb 12, 2026 12:23 IST

    నేడు సాయంత్రం ఢిల్లీకి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

    • సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యే అవకాశం

    • తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు, జల వివాదాలపై చర్చించే అవకాశం

  • Feb 12, 2026 12:16 IST

    గురుకులాల్లో భోజనాలు బాగుండటం లేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

    • భోజనాల కోసం విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు: హరీశ్ రావు

    • గురుకులాలు, ఓయూలో విద్యార్థులు నిరసనలు చేస్తుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: హరీశ్ రావు

    • విద్యార్థులు ఆందోళన చేస్తున్నా.. సీఎం స్పందించడం లేదు: హరీశ్ రావు

  • Feb 12, 2026 11:51 IST

    ఏపీ శాసనమండలిలో పెన్షన్లపై రభస

    • పెన్షన్లలో కోతతో పాటు తొలగిస్తున్నారని వైసీపీ సభ్యుల ఆరోపణ

    • మంత్రి అచ్చెన్నాయుడు, బొత్సల మధ్య మాటల యుద్ధం

    • మీ హయాంలో లాగా మేం పెన్షన్లు తొలగించలేదు: అచ్చెన్నాయుడు

  • Feb 12, 2026 11:30 IST

    విజయవాడ: గుణదలలోని కారులో మృతదేహం

    • ఏలూరు రోడ్డు దగ్గర పార్క్ చేసిన కారులో మృతదేహం గుర్తింపు

    • మద్యం తాగి కారులో మృతిచెందినట్లు పోలీసుల అనుమానం

  • Feb 12, 2026 11:11 IST

    లోక్‌సభలో గందరగోళం

    • లోక్‌సభ మధ్యాహ్నం 12:00 గంటలకు వాయిదా

  • Feb 12, 2026 11:11 IST

    ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనపై UN నివేదిక

    • పేలుడులో జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠాతో సంబంధం: నివేదిక

    • నిఘా నుంచి తప్పించుకునేందుకు జైషే కొత్త పన్నాగాలు: UN నివేదిక

  • Feb 12, 2026 10:51 IST

    మధ్యాహ్నం మచిలీపట్నం ప్రాంత MLAలతో చంద్రబాబు భేటీ

    • కృష్ణా జిల్లా అభివృద్ధి, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెండింగ్ పనులపై చర్చ

    • హాజరుకానున్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు

  • Feb 12, 2026 10:48 IST

    ఆదిలాబాద్: మహరాష్ట్ర సరిహద్దులోని దయ్యాల ధనూర్‌లో ఎలుగుబంటిని బంధించిన అటవీ సిబ్బంది

    • కొద్ది రోజులుగా మహారాష్ట్రలో ఎలుగుబంటి దాడిలో ముగ్గురు మృతి, మరో ముగ్గురికి గాయాలు

    • అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి రావడంతో స్థానికుల్లో భయాందోళన

    • ముప్పు నేపథ్యంలో డాటింగ్‌తో‌ మత్తు ఇచ్చి బంధించిన అటవీ అధికారులు

    • ఊపిరి పీల్చుకున్న ప్రజలు

  • Feb 12, 2026 10:46 IST

    సంగారెడ్డి జిల్లాలో కార్మిక సంఘాల ఆందోళన

    • దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జహీరాబాద్‌లో కార్మిక సంఘాల ఆందోళన

    • కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్

    • సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

  • Feb 12, 2026 10:14 IST

    అమరావతి: అసెంబ్లీలో ప్రారంభమైన జీరో అవర్

    • కొనసాగుతున్న జీరో అవర్

  • Feb 12, 2026 10:10 IST

    అమరావతి: అసెంబ్లీలో ముగిసిన ప్రశ్నోత్తరాలు

    • నిర్ణీత గడువుకు 10 నిముషాల ముందే ముగిసిన ప్రశ్నోత్తరాలు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

    • విద్యార్థులకు రాజకీయాలు, చట్ట సభలు, ప్రజాప్రతినిధుల గురించి తెలుసుకుంటారని వారిని సభకు పిలిచాం: స్పీకర్

    • గవర్నర్ ప్రసంగ సమయంలో కొందరు సభ్యులు అనుచితంగా వ్యవహరించారు, కాపీలను చించి విసిరారు: స్పీకర్

    • ఇలాంటివి జరగడం భాదకలిగించింది: స్పీకర్

  • Feb 12, 2026 09:58 IST

    గవర్నర్‌ ప్రసంగాన్ని వైసీపీ అడ్డుకుంది: సభాపతి అయ్యన్నపాత్రుడు

    • నిన్నటి ఘటన బాధాకరం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

    • గవర్నర్ ప్రసంగిస్తుండగా అడ్డుకోవడం దారుణం: అయ్యన్నపాత్రుడు

    • ఇలాంటి ఘటనలు సభకు తలవంపులు తెస్తాయి: అయ్యన్నపాత్రుడు

  • Feb 12, 2026 09:45 IST

    కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    • ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

    • సభలో పలు ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టనున్న సర్కార్‌

    • తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం

  • Feb 12, 2026 09:43 IST

    హైదరాబాద్‌: పాత బస్తీలో రెచ్చిపోయిన రౌడీషీటర్

    • కాలాపత్తర్ ఫాతిమా అస్పత్రి వద్ద ఓ షాప్ ఓనర్‌పై కత్తితో దాడి

    • తల్వార్లతో రౌడీ షీటర్ అసద్ గ్యాంగ్ హంగామా

    • టూవీలర్‌పై కూర్చున్న ఓనర్‌పై తల్వార్లతో దాడి.. సీసీటీవీ కెమెరెల్లో రికార్డైన దృశ్యాలు

  • Feb 12, 2026 09:42 IST

    కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బాలుడి మృతి

    • ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలో రెండు కార్లు ఢీ

    • ఘటనలో 11 నెలల బాలుడి మృతి.. మరో ఐదుగురికి గాయాలు

  • Feb 12, 2026 09:41 IST

    జయశంకర్ భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం

    • పరకాల-భూపాలపల్లి హైవేపై రేగొండ వద్ద రెండు లారీలు ఢీ

    • క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

    • రక్షించి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించిన స్థానికులు

  • Feb 12, 2026 09:39 IST

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

    • చుంచుపల్లి మండలం రాంపురం సమీపంలో కొత్తగూడెం-విజయవాడ హైవేపై ట్రాక్టర్‌-లారీ ఢీ

    • వీఎం బంజర్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మృతి

  • Feb 12, 2026 09:38 IST

    కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    • ప్రశ్నోత్తరాలు చేపట్టనున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

    • ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ప్రభుత్వ ఎజెండాపై చర్చ

    • సభలో 8 సవరణ ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం

    • తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం

  • Feb 12, 2026 09:37 IST

    మంచిర్యాల: ఎన్నికల ఫలితాలకు ముందే ఆయా పార్టీ అభ్యర్థుల క్యాంపు రాజకీయాలు

    • మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు ముందే BRS, BJP అభ్యర్థుల క్యాంపు రాజకీయాలు

    • రహస్య శిబిరాలకు తరలివెళ్లిన చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల BRS అభ్యర్థులు

    • మహారాష్ట్రకు వెళ్లిన మంచిర్యాల కార్పొరేషన్‌, లక్షెట్టిపేట మున్సిపాలిటీ BJP అభ్యర్థులు

  • Feb 12, 2026 09:35 IST

    ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

    • కైకలూరు మండలం పల్లెవాడ దగ్గర రోడ్డు ప్రమాదం

    • పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి గాయాలు

    • ఏలూరు ఆస్పత్రికి వెళ్తుండగా తండ్రి, కుమార్తెలకు గాయాలు

  • Feb 12, 2026 09:33 IST

    రాజమండ్రి: మాజీ మంత్రిని సెంట్రల్ జైలు నుంచి సత్తెనపల్లికి తీసుకెళ్లిన పోలీసులు

    • అక్రమ వసూళ్ల కేసులో పీటీ వారెంట్‌పై అంబటి రాంబాబును..

    • రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సత్తెనపల్లి తీసుకువెళ్లిన పోలీసులు

    • సత్తెనపల్లి కేసులో అంబటి రాంబాబును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

  • Feb 12, 2026 09:24 IST

    హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ

    • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో సభ

    • ఆర్టీసీ కల్యాణమండపంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ

  • Feb 12, 2026 09:22 IST

    బీఏసీ సమావేశాల నిర్ణయాలను సభలో పెట్టనున్న సీఎం చంద్రబాబు

    • ఉభయ సభల్లో తమ శాఖల నివేదికలు ప్రవేశపెట్టనున్న మంత్రులు

    • విద్యుత్ సుంకం-2025 సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి గొట్టిపాటి

    • ఏపీ అగ్నిమాపక సేవ సవరణ ఆర్డినెన్స్‌ సభలో..

    • ప్రవేశపెట్టనున్న హోం మంత్రి వంగలపూడి అనిత

  • Feb 12, 2026 09:20 IST

    నంద్యాల జిల్లా: శ్రీశైలం పుణ్య క్షేత్రంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

    • శ్రీశైలంలో ఐదో రోజుకు చేరిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

    • శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు

  • Feb 12, 2026 09:16 IST

    శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబు బెదిరింపు

    • గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ విమానానికి బెదిరింపు మెయిల్‌

    • తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చిన అధికారులు

    • మెయిల్‌పై దర్యాప్తు చేస్తున్న ఎయిర్‌పోర్ట్ పోలీసులు

  • Feb 12, 2026 09:15 IST

    తమిళనాడు: దిండుక్కల్‌ జిల్లాలో విషాదం

    • జల్లికట్టు పోటీల్లో యువకుడి మృతి

    • మరో 26 మందికి గాయాలు.. 10 మంది పరిస్థితి విషమం

  • Feb 12, 2026 08:56 IST

    నేటితో రెండో రోజుకు చేరిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    • బీఏసీ సమావేశాల నిర్ణయాలను సభలో పెట్టనున్న సీఎం చంద్రబాబు

    • ఉభయ సభల్లో తమ శాఖల నివేదికలు ప్రవేశపెట్టనున్న మంత్రులు

    • విద్యుత్ సుంకం 2025 సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి గొట్టిపాటి

    • ఏపీ అగ్నిమాపక సేవా సవరణ ఆర్డినెన్స్‌ను సభలో ప్రవేశపెట్టనున్న హోం మంత్రి అనిత

  • Feb 12, 2026 08:55 IST

    నేడు తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం

    • జీహెచ్ఎంసీ విభజన, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

    • టీబీజేపీ చీఫ్ రాంచందర్‌ రావు అధ్యక్షతన భేటీ

  • Feb 12, 2026 08:48 IST

    కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై కేసు నమోదు

    • ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని కమలాకర్‌పై కేసులు నమోదు చేసిన సీపీ

    • కిసాన్ నగర్‌లో డబ్బులు పంపిణీ చేస్తున్న జంపయ్యను పట్టుకుని జీప్ ఎక్కించిన పోలీసులు

    • పోలీస్ వాహనం నుంచి జంపయ్యను బయటకు లాక్కొచ్చిన ఎమ్మెల్యే గంగుల

    • తమ అదుపులో ఉన్న వ్యక్తిని బలవంతంగా విడిపించడంపై పోలీసుల సీరియస్

    • గంగుల కమలాకర్‌తో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు

    పూర్తి కథనం

  • Feb 12, 2026 08:30 IST

    దేశ వ్యాప్తంగా వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు

    • ఉదయం 8:00 గంటల నుంచే భానుడి భగభగలు

    • పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం

    • ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ అంచనా వివరాలపై పూర్తి కథనం

  • Feb 12, 2026 08:00 IST

    నేడు ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం-చర్చ

    • బీఏసీ సమావేశాల నిర్ణయాలను సభలో ప్రవేశపెట్టనున్న సీఎం చంద్రబాబు

    • ఉభయ సభల్లో తమ శాఖలకు సంబంధించిన పత్రాలు ప్రవేశపెట్టనున్న మంత్రులు

  • Feb 12, 2026 07:50 IST

    బిహార్, సమస్తీపూర్‌ జిల్లాలో దారుణం

    • నితీశ్ కుమార్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లిచేసిన యువతి కుటుంబం

    • పోలీసుల సాయంతో బయటపడిన నితీశ్

    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పెళ్లి వీడియో

    పూర్తికథనం

  • Feb 12, 2026 07:04 IST

    నేటితో 12వ రోజుకు పార్లమెంట్ సమావేశాలు

    • రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై కొనసాగుతున్న దుమారం

    • సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైన కేంద్రం

  • Feb 12, 2026 07:02 IST

    నేడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ నేతృత్వంలో డీఏసీ భేటీ

    • ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ నేతృత్వంలో డీఏసీ సమావేశం

    • ‌‌114 రాఫెల్‌ జెట్‌ల కొనుగోలు ప్రతిపాదనపై నిర్ణయం

  • Feb 12, 2026 06:50 IST

    హైదరాబాద్: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం

    • సాయినగర్‌లోని హీరో షోరూంలో చెలరేగిన మంటలు

    • ‌‌‌షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు

    • ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

    • ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని నిర్ధారణ

    పూర్తి కథనం