Share News

రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ రోజు వెదర్ అప్‌డేట్ ఇదే..

ABN , Publish Date - Feb 12 , 2026 | 08:08 AM

ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. మధ్యాహ్నం పూట 30 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ రోజు వెదర్ అప్‌డేట్ ఇదే..
Hyderabad weather update

ఇంటర్‌నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. మధ్యాహ్నం పూట 30 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ రోజు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదు అయ్యే అవకాశం ఉంది. రాత్రి, తెల్లవారుజామున కనిష్ట ఉష్ణో్గ్రతలు 17 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదు అయ్యే అవకాశం ఉంది.


దేశ వ్యాప్తంగా బలమైన గాలులు..

భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో గాలుల వేగం పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కూడా ఉంది. పగటిపూట ఎండల తీవ్రత ఉన్నా.. సాయంత్రం తర్వాత చల్లని గాలులు వీచే అవకాశం ఉంది. రైతులు, ప్రయాణీకులు, బహిరంగ ప్రదేశాల్లో పనులు చేసే వారు అప్రమత్తంగా ఉండాలి. మరో రెండు, మూడు రోజుల పాటు ఈ పరిస్థితులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.


అనారోగ్యాల బారిన జనం..

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒకేరోజు వేరువేరు వాతావరణ పరిస్థితులు ఉండటం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. చాలామంది దగ్గు, గొంతునొప్పి, చలిజ్వరం, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన వంకాయ

చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Feb 12 , 2026 | 08:18 AM